ఉక్రెయిన్ ఉరుము... భారత్ పై ధరల పిడుగే

Update: 2022-02-19 15:30 GMT
ఉరిమి ఉరిమి ఎవరి మీదనో పడిందనే సామెతలా.. ఉక్రెయిన్ పరిణామాలు భారత్ పాలిట ధరల పిడుగులా మారడం ఖాయమనిపిస్తోంది. అసలే అధిక ద్రవ్యోల్బణం.. నిరుద్యోగంతో సతమతం అవుతున్న భారత్ కు మరింత ఇబ్బందికర పరిణామాలు తప్పేలా లేవు. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరల వాత ఖాయమనిపిస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు మాత్రం కాదు. ఈ ధరాభారాన్నుంచి మనకు తాత్కాలిక ఉపశమనం ఇస్తున్నది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. అందులోనూ అతి పెద్ద రాష్ట్రమైన యూపీ ఎన్నికలు ఉండడం, పంజాబ్ లో పోరు ప్రతిష్ఠాత్మకం కావడం తో్ కేంద్ర ప్రభుత్వం ధరల తేనె తుట్టెను కదిలించడం లేదు. అయితే, ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ తుట్టె కదలడం ఖాయమని తెలుస్తోంది. అంటే.. మార్చి 10 వ తేదీ తర్వాత వడ్డింపులకు సిద్ధంగా ఉండాల్సిందే.

చమురు సరఫరాపై ఉక్రెయిన్ యుద్ధ మేఘాలు ఉరిమి ఉరిమి ఎవరి మీదనో పడిందనే సామెతలా.. ఉక్రెయిన్ పరిణామాలు భారత్ పాలిట ధరల పిడుగులా మారడం ఖాయమనిపిస్తోంది. అసలే అధిక ద్రవ్యోల్బణం.. నిరుద్యోగంతో సతమతం అవుతున్న భారత్ కు మరింత ఇబ్బందికర పరిణామాలు తప్పేలా లేవు. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరల వాత ఖాయమనిపిస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు మాత్రం కాదు. ఈ ధరాభారాన్నుంచి మనకు తాత్కాలిక ఉపశమనం ఇస్తున్నది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. అందులోనూ అతి పెద్ద రాష్ట్రమైన యూపీ ఎన్నికలు ఉండడం, పంజాబ్ లో పోరు ప్రతిష్ఠాత్మకం కావడం తో్ కేంద్ర ప్రభుత్వం ధరల తేనె తుట్టెను కదిలించడం లేదు. అయితే, ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ తుట్టె కదలడం ఖాయమని తెలుస్తోంది. అంటే.. మార్చి 10 వ తేదీ తర్వాత వడ్డింపులకు సిద్ధంగా ఉండాల్సిందే.

ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశాల్లో రష్యా, ఉక్రెయిన్ ముందుంటాయి. వాటి మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సహజంగానే చమురు సరఫరాపై ప్రభావం చూపనున్నాయి. తద్వారా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలు మరీ ముఖ్యంగా భారత్ పై ప్రభావం పడి పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వస్తాయనే అంచనాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ భయాలతో ఇటీవల స్టాక్ మార్కెట్ ఎంత ఊగిపోయిందో అందరూ చూసిందే. ఇదే భయాలు ఇప్పుడు పెట్రో ధరలపై వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించిస్తే..  పరిస్థితులు చమురు సరఫరాను దెబ్బతీయగలవని చెబుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉండకపోవచ్చని, ఈ పరిణామాలు వాటి ధరలు పెరగడానికి దారి తీయగలవనే అభిప్రాయాలు ఉన్నాయి.

గరిష్ఠానికి బ్రెంట్ క్రూడ్

ఫ్యూచర్స్ 57 శాతానికి ట్రేడ్ అయింది. బ్యారెల్ ధర 93.54 డాలర్లు పలికింది.

యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో క్రూడ్ ప్రైస్ 69 శాతానికి ట్రేడ్ అయింది. డాలర్‌తో పోల్చుకుంటే 0.5 శాతం తగ్గింది. 91.07 డాలర్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఈ వారం ఆరంభంలో అటు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్, ఇటు యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో బ్యారెల్ ధర గరిష్ఠస్థాయికి చేరింది. శుక్రవారం నాటికి వాటి ధరల్లో స్వల్పంగా క్షీణత కనిపించింది.

వచ్చేవార అత్యంత కీలకం..

ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వచ్చేవారం ఆయిల్ ట్రేడింగ్‌లో మార్కెట్ వర్గాలు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నాయి . 50 శాతం మంది రష్యన్ సైనికులు- ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడానికి సన్నద్ధంగా ఉన్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. రష్యా దీన్ని తోసిపుచ్చింది. అగ్రరాజ్యం అమెరికా సైతం ఇదే రకమైన ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించడానికి తనవంతు ప్రయత్నాలు సాగిస్తోంది.  

సరఫరాపై ప్రభావం.. ఇరాన్ పాత్ర కీలకం

ఉక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధం జరిగితే ఇరాన్ తన చమురు సరఫరాను కట్టుదిట్టం చేయొచ్చని, ఫలితంగా- డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉండకపోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే - రేట్లు పెరగడం ఖాయమని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ- ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచకపోవడానికి ఎన్నికలే కారణం అనే వాదనలు న్నాయి. మార్చి 10వ తేదీ తరువాత అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా వాటి రేట్లను సవరిస్తాయని చెబుతున్నారు.

గతేడాది అనుభవాలు గుర్తున్నాయా?

గత సంవత్సరం కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలి తాలు వెలువడిన మే 4వ తేదీ తరువాతే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు పెట్రో ఉత్పత్తులు కూడా వంద రూపాయల మార్క్‌ను దాటేశాయి. పెట్రోల్ ధర ఒక దశలో లీటర్ ఒక్కింటికి 120 రూపాయల వరకు వెళ్లింది. ఆ తరువాత- దీపావళి పండగ కానుకగా కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తేయడంతో కాస్త అదుపులోకి వచ్చింది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశాల్లో రష్యా, ఉక్రెయిన్ ముందుంటాయి. వాటి మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సహజంగానే చమురు సరఫరాపై ప్రభావం చూపనున్నాయి. తద్వారా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలు మరీ ముఖ్యంగా భారత్ పై ప్రభావం పడి పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వస్తాయనే అంచనాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ భయాలతో ఇటీవల స్టాక్ మార్కెట్ ఎంత ఊగిపోయిందో అందరూ చూసిందే. ఇదే భయాలు ఇప్పుడు పెట్రో ధరలపై వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించిస్తే..  పరిస్థితులు చమురు సరఫరాను దెబ్బతీయగలవని చెబుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉండకపోవచ్చని, ఈ పరిణామాలు వాటి ధరలు పెరగడానికి దారి తీయగలవనే అభిప్రాయాలు ఉన్నాయి.

గరిష్ఠానికి బ్రెంట్ క్రూడ్

ఫ్యూచర్స్ 57 శాతానికి ట్రేడ్ అయింది. బ్యారెల్ ధర 93.54 డాలర్లు పలికింది.

యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో క్రూడ్ ప్రైస్ 69 శాతానికి ట్రేడ్ అయింది. డాలర్‌తో పోల్చుకుంటే 0.5 శాతం తగ్గింది. 91.07 డాలర్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఈ వారం ఆరంభంలో అటు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్, ఇటు యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో బ్యారెల్ ధర గరిష్ఠస్థాయికి చేరింది. శుక్రవారం నాటికి వాటి ధరల్లో స్వల్పంగా క్షీణత కనిపించింది.

వచ్చేవార అత్యంత కీలకం..

ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వచ్చేవారం ఆయిల్ ట్రేడింగ్‌లో మార్కెట్ వర్గాలు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నాయి . 50 శాతం మంది రష్యన్ సైనికులు- ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడానికి సన్నద్ధంగా ఉన్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. రష్యా దీన్ని తోసిపుచ్చింది. అగ్రరాజ్యం అమెరికా సైతం ఇదే రకమైన ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించడానికి తనవంతు ప్రయత్నాలు సాగిస్తోంది.  

సరఫరాపై ప్రభావం.. ఇరాన్ పాత్ర కీలకం

ఉక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధం జరిగితే ఇరాన్ తన చమురు సరఫరాను కట్టుదిట్టం చేయొచ్చని, ఫలితంగా- డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉండకపోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే - రేట్లు పెరగడం ఖాయమని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ- ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచకపోవడానికి ఎన్నికలే కారణం అనే వాదనలు న్నాయి. మార్చి 10వ తేదీ తరువాత అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా వాటి రేట్లను సవరిస్తాయని చెబుతున్నారు.

గతేడాది అనుభవాలు గుర్తున్నాయా?

గత సంవత్సరం కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలి తాలు వెలువడిన మే 4వ తేదీ తరువాతే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు పెట్రో ఉత్పత్తులు కూడా వంద రూపాయల మార్క్‌ను దాటేశాయి. పెట్రోల్ ధర ఒక దశలో లీటర్ ఒక్కింటికి 120 రూపాయల వరకు వెళ్లింది. ఆ తరువాత- దీపావళి పండగ కానుకగా కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తేయడంతో కాస్త అదుపులోకి వచ్చింది.
Tags:    

Similar News