విన్నంతనే ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. వికారం కలిగించే ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. చీరకట్టుకున్న ఆమె మదిలోని ఆలోచనలు వణికేలా చేయటమే కాదు.. పోలీసులు సైతం పరేషాన్ అవుతున్నారు. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూడని ఈ తరహా నేరం కొత్త సందేహాలకు.. సరికొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి. ఒంగోలులో ఒక భర్త పెంట్ హౌస్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. అంతేకాదు.. విస్తుపోయే వాస్తవాల్ని వెలికి తీశారు. ఇంతకీ ఈ సుమలత అలియాస్ సాయితేజా రెడ్డి ఎవరు? ఏం చేసేది? అన్నది చూస్తే..
సుమలత చీర కడుతుంది. కానీ.. ఫ్యాంటు షర్ట్ వేసుకోవటం మహా ఇష్టం. మహిళే అయినప్పటికీ మాట కాస్త గంభీరంగా ఉంటుంది. దాన్ని మరింత మార్చి మాట్లాడే ఆమెలో ఎవరూ ఊహించలేని వికారపు ధోరణి ఉంది. అదే.. అమ్మాయిలంటే పిచ్చి. మగాళ్లలా మాట్లాడి అమ్మాయిల్ని ట్రాప్ చేసి.. వారిని లైంగికంగా వేధించే దోరణి ఉంది. తాజాగా ఒక మైనర్ బాలికను తన మాటలతో మాయ చేయటమే కాదు.. ట్రాప్ చేసి ఇంటికి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు నరకం చూపించిన వైనం పోలీసుల వరకూ వెళ్లింది.
రంగంలోకి దిగిన పోలీసులు సుమలత ఇంటిని తనిఖీ చేయటంతో షాక్ తిన్నారు. తమ గుట్టు రట్టు కావటంతో అవమానభారంతో సుమలత భర్త (సహజీవనం చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు) ఏడుకొండలు మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. .
సుమలత సొంతూరు ఒంగోలు జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం. చాలా రోజుల క్రితమే భర్తతో తెగతెంపులు చేసుకుంది. భార్యతో విడాకులు తీసుకున్న ఏడుకొండలుతో ఏడేళ్ల నుంచి సహజీవనం చేస్తుందని కొందరు చెబుతుంటే.. మరికొందరు ఆమెను పెళ్లాడినట్లుగా చెబుతున్నారు. వీరు తరచూ ఇళ్లు మారుస్తూ ఉంటారు. మూడు నెలల క్రితం మారుతీనగర్ లో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారికి సిమ్ కార్డులు విక్రయించే వంశీ అనే యువకుడు పరిచయమయ్యారు. సిమ్ కార్డుల కోసం వచ్చే యువతుల ఫోన్ నెంబర్లను సుమలతకు ఇచ్చేవాడు.
అలా నెంబర్లను సేకరించే సుమలత.. వాటిలోని మహిళలకు తనను తాను సాయితేజా రెడ్డి పేరుతో మాట్లాడేది. వారిని ట్రాప్ చేసేది. ఇదేమీ తెలీని వారు ఆమెను నమ్మితే.. గుట్టుగా వారిపై అత్యాచారానికి పాల్పడేది. తనకున్న అసహజ లైంగిక వాంఛల్ని తీర్చుకునేందుకు వికృతంగా వ్యవహరించేది. ఆమె దుర్మార్గాలకు భర్త ఏడుకొండలు పూర్తిగా సహకరించేవాడు.
పెళ్లి కాని యువతులు.. బాలికల్ని లక్ష్యంగా చేసుకునేవారు. వీరి బారిన పడిన పలువురు బాధితులుగా మారినా.. బయటకు చెబితే పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉండిపోయేవారు. తాజాగా ఒక మైనర్ బాలిక విషయంలో వీరు చేసిన దుర్మార్గం.. ఆ బాలిక ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వీరి ఆట కట్టింది.
వీరింట్లో పోలీసులు తనిఖీలు చేయగా.. సెక్స్ టాయిస్ తో పాటు.. కొన్ని ఆధారాలు లభించాయి. ఇదే సమయంలో తమ గుట్టు మొత్తం పోలీసులకు తెలిసిపోయిందన్న భయంతో ఏడుకొండలు ఆత్మహత్య చేసుకోగా.. సుమలత.. వంశీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా కోర్టు ఆమెకు పదిహేను రోజుల రిమాండ్ ను విధించింది. అమ్మాయిల్ని.. అమ్మాయిలు నమ్మే రోజులు పూర్తిగా పోయాయన్న విషయాన్ని సుమలత ఉదంతంతో స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.