షాకింగ్ న్యూస్: తోపుడు బండి వ్యాపారికి ఇద్దరు గన్‌మెన్లతో భద్రత.. రీజనేంటంటే
ఆయన అత్యంత సాధారణ చిరు వ్యాపారి. నిత్యం నాలుగు చక్రాల తోపుడు బండిపై చిన్నారులు.. మహిళ ల దుస్తులను పెట్టుకుని.. వివిధ ప్రాంతాలకు నడుచుకుంటూ.. వెళ్లి వ్యాపారం చేసుకుంటారు. మహా అయి తే.. రోజుకు రూ.300 నుంచి 500 మాత్రమే సంపాయించుకుంటారు.
ఆ సొమ్ముతోనే కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారు. అలాంటి అత్యంత సాధారణ.. చిరు వ్యాపారికి.. ఏకంగా.. పొలిటీషియన్లు.. ఉన్నతాధికారులకు ఇచ్చే కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.
ఏకే-47 గన్స్‌తో ఉన్న ఇద్దరు యువ పోలీసులు ఈ వ్యాపారికి భద్రతగా నిలిచారు. అది కూడా కోర్టు ఆదేశించ డం గమనార్హం. మరి ఏం జరిగింది? ఎందుకు అంత భద్రత కల్పించారు? అనేది ఆసక్తిగా మారింది. దీనికి కారణం.. సదరు వ్యాపారి భూమి విషయంలో ఓ రాజకీయ నేతతోపెట్టుకున్నారు. అది కూడా ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడితో కావడం గమనార్హం. దీంతో్ వ్యాపారి కోరకుండా నే.. కోర్టు ఆయనకు ఏకే-47తో ఇద్దరిని భద్రతగా నియమించడం విశేషం.
ఏం జరిగిందంటే..
యూపీలోని ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాల్ తోపుడు బండిపై బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్ను కలిశారు. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో జుగేంద్ర సింగ్.. తనను కులం పేరుతో దూషించారని పోలీస్ స్టేషన్లో దయాల్ ఫిర్యాదు చేశారు. దీనిపై జుగేంద్ర సింగ్ హైకోర్టుకు వెళ్లారు.
రామేశ్వర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని.. ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు. ఈ క్రమంలోనే రామే శ్వర్ దయాల్ను శనివారం కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకు వచ్చిన దయాల్ను చూసిన న్యాయమూర్తి.. ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనకు ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. తక్షణం బాధితుడికి ఇద్దరు బాడీగార్డ్స్ను ఏకే-47తో సహా భద్రతగా నియమించాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం దయాల్‌కు భద్రత కల్పించింది.
తర్వాత ఏం జరిగింది?
వ్యాపారి రామేశ్వర్ బట్టలు అమ్ముతుండగా.. ఇద్దరు బాడీగార్డ్స్ ఏకే 47 తుపాకులతో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. దీంతో బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారులు.. రామేశ్వర్ బాడీగార్డ్స్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు.. ఆయన దగ్గర బట్టలు కొనేందుకు జంకుతున్నారు. దీంతో వ్యాపారం దెబ్బతిందని.. తాను ఇబ్బందులు పడుతున్నానని దయాల్ వాపోతున్నారు.