సెక్సు కోసం వెళ్లాలి.. ఈపాస్ ఇప్పిస్తారా? పోలీసులకు షాకింగ్ రిక్వెస్టు

Update: 2021-05-14 11:30 GMT
లాక్ డౌన్ వేళ.. బయటకు వెళ్లాలంటే అందుకు అవసరమైన ఈపాస్ తప్పనిసరి. ఉన్న ఊళ్లో ఒక చోటు నుంచి మరో చోటుకు పెద్ద ఇబ్బందులు ఉండవు కానీ.. అందుకు భిన్నంగా లాక్ డౌన్ అమలయ్యే సమయంలో మాత్రం వేరే చోటుకు వెళ్లాలంటే పాస్ తప్పనిసరి. దీంతో.. బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్న వారు పోలీసులకు రిక్వెస్టులు పంపుతుంటారు. తాజాగా కేరళలోని కన్నూర్ లోని కన్నాపురానికి చెందిన  పోలీసులకు వచ్చిన ఈ-పాస్ రిక్వెస్టు చేసి షాక్ తిన్నారు. విపత్తు వేళ.. ఇలాంటి రిక్వెస్టా? అంటూ ఆగ్రహానికి గురయ్యారు.

ఇంతకూ ఆ పాస్ రిక్వెస్టులో ఏముందంటే.. తాను సాయంత్రం సెక్సుకు వెళ్లాలని.. అందుకు ఈ పాస్ ఇవ్వాలని కోరారు. ఈ వినతిని చూసినంతనే ఒళ్లు మండిన పోలీసులు రంగంలోకి దిగారు. రిక్వెస్టు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అతను చెప్పిన సమాధానంతో మారు మాట్లాడకుండా.. జాగ్రత్తగా ఉండాలని చెప్పి వదిలేశారు. ఇంతకూ పోలీసుల్ని అంతలా ఎలా కన్వీన్స్ చేశాడన్న విషయంలోకి వెళితే.. సాయంత్రం సిక్స్ కు బయటకు వెళ్లాలన్న రిక్వెస్టులో.. సిక్సుకు బదులుగా సెక్స్ అనే మాట అచ్చుతప్పుగా పడిందని.. అంతే తప్పించి తనకు వేరే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు.

దీంతో.. అతడికి వార్నింగ్ ఇచ్చి పోలీసులు విడిచి పెట్టారు. నిజంగానే సెక్సు కోసమని రిక్వెస్టు పెట్టి.. పోలీసులు తీరుతో తెలివిగా చెప్పి తప్పించుకున్నాడా? నిజంగానే పొరపాటున సిక్స్ బదులుగా సెక్సు రాసి తలనొప్పి తెచ్చి పెట్టుకున్నాడా? అన్న దాని మీద మాత్రం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
Tags:    

Similar News