నిత్యం ఒత్తిడితో కూడిన జీవనం, వ్యాయామానికి సమయం కేటాయించలేకపోవడం, పోటీ ప్రపంచంలో రోజూ ఉరుకులపరుగుల జీవితం, విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం, జీవనశైలి.. మనదేశంలో గుండెపోటుకు కారణాలవుతున్నాయని వైద్యుల సర్వేలో వెల్లడైంది. ఈ కారణాలతో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారని షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయి.
భారతీయుల్లో గుండె జబ్బులకు కారణాలు ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయా?.. అనే అంశంపై సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి చెందిన సీనియర్ కార్డియాలజిస్టు డా.హయగ్రీవరావు నేతృత్వంలో ఒక అధ్యయనం జరిగింది. ఇందులో భాగంగా వైద్యుల బృందం దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 15 ప్రముఖ ఆసుపత్రుల్లో పరిశోధన చేశారు. ఏకంగా రెండేళ్ల పాటు 2153 మంది రోగులను పరిశీలించి అధ్యయనం చేశారు. ఇండియన్ హార్ట్ జర్నల్-22లో సర్వే అంశాలు తాజాగా ప్రచురితమయ్యాయి.
డా.హయగ్రీవరావు నేతృత్వంలోని వైద్యుల బృందం చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
మనదేశంలో గుండె జబ్బులకు.. ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ వంటివి కారణమవుతున్నాయని తేలింది. వీటితోపాటు ఊబకాయం, వ్యాయామలేమి, మారిన జీవనశైలి, హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌తోనూ అంతే ముప్పు ఉందని స్పష్టమైంది.
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలోనూ చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడటానికి, హఠాన్మరణాలకు ఊబకాయం, వ్యాయామలేమి, మారిన జీవన శైలి ముఖ్య కారణాలని వైద్యులు గుర్తించారు. స్థూలకాయం, కదలికలు లేని జీవనశైలి, షుగర్ వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం వంటివి గుండెపోటుకు కారణాలవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
కాగా వైద్యుల అధ్యయనం ప్రకారం... సగటున 60 ఏళ్ల వయసులో పురుషుల్లో 66 శాతం, మహిళల్లో 56 శాతం మంది గుండెపోటు బారిన పడ్డారు. 50 ఏళ్ల వయసులో పురుషుల్లో మూడింట ఒక వంతు, మహిళల్లో నాలుగింట ఒక వంతు గుండెపోటుకు గురయ్యారు. సుమారు పది శాతం మంది 40 ఏళ్లలోపు గుండె జబ్బుల బారినపడ్డారు.
పొగతాగడం (ధూమపానం), హైబీపీ, షుగర్, అధిక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ వంటి లక్షణాలు వైద్యులు తమ పరిశోధనకు ఎంచుకున్న 93 శాతం మంది రోగుల్లో కనిపించాయి. అలాగే ఊబకాయం (అధిక బరువు), శారీరక శ్రమలేకపోవటం, హెచ్‌డీఎల్ తదితరాల్లో ఏదో ఒకటి ఏకంగా 95 శాతం మందిలో ఉండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే.. రక్తపోటు , మధుమేహం కచ్చితంగా నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యకర ఆహారం, సక్రమ వ్యాయామం ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. మూడింట ఒక వంతు రోగులకు హెచ్‌బీఏ1సీ 6 నుంచి 6.5 మధ్య ఉంటోందని అంటున్నారు. ఈ పరీక్ష చాలా అవసరమని పేర్కొంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.