అదేంటోగానీ.. జగన్ సర్కారు వచ్చిన దగ్గర్నుంచి అన్నీ "పరీక్షలే". 2019 వేసవిలో ఏపీలో అధికారం దక్కించుకున్న వైఎస్సార్ పార్టీకి ఆర్నెళ్లు హాయిగానే గడిచిపోయింది.వాస్తవానికి ఈ ఆర్నెళ్ల వ్యవధిని ఏ ప్రభుత్వానికైనా హనీమూన్ టైమ్ గా పిలుస్తారు. జగన్ సర్కారు.. ఆ హనీమూన్ అయిపోతూనే.. మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చింది. దీంతో అమరావతి ఉద్యమం, దానిపై విమర్శలు, ఆరోపణలు చెలరేగాయి.అవలా ఉండగానే.. కొవిడ్19 మీదపడింది. నాడు.. అంటే 2020 వేసవిలో ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది.
విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు వచ్చింది. ఇక 2021 వేసవిలో సెకండ్ వేవ్ విరుచుకుపడింది. మొదటి వేవ్ కంటే తీవ్రాత్రి తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.అప్పట్లోనూ పరీక్షల నిర్వహణపై సందిగ్ధతే. కొన్ని రాష్ట్రాలు రద్దు చేయగా.. కొన్ని నిర్వహించి తీరుతామంటూ పట్టుబట్టాయి.అన్నట్లు.. పరీక్షలు జరిపి తీరతామని మొండికేసిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. విద్యార్థుల భవిష్యత్ ను ఆలోచించే తాము పరీక్షలు జరుపుతున్నట్లు నాడు ఏపీ సర్కారు వాదించింది.
పరీక్షలు అలా అయితే.. టెన్త్ ఫలితాలు ఇలా..ఇక కొవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చి.. లాక్ డౌన్ ల వంటివేమీ లేని ఈ ఏడాది అన్ని రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను నిర్వహించాయి. ఇందులో ఎలాంటి వివాదానికీ తావులేదు.అయితే, ఏపీలో మాత్రం కాస్త తేడా కదా? ఈ ఏడాది టెన్త్ పేపర్ల లీక్ పెద్ద వివాదమే రేపింది. ఏకంగా మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల నుంచే టెన్త్ పేపర్లు లీక్ అయ్యాయంటూ వివాదం రేగింది. అది కూడా రోజుకో పేపర్ చొప్పున లీక్ కావడంతో సంచలనం నెలకొంది. చివరకు నారాయణను అరెస్టు చేసేంతవరకు వెళ్లింది. లీక్ లో అసలు సూత్రధారులు ఎవరు?అనేది తేలాల్సి ఉంది.
ఫలితాలు విడుదల చేద్ద్దాం అనుకుంటే..ఏపీలో వాస్తవానికి టెన్త్ ఫలితాలను గత శనివారం విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా చివరి నిమిషంలో సోమవారానికి (అంటే ఈ నెల 6వ తేదీకి) వాయిదా వేశారు.సంగతి కూడా వార్తల్లో నిలిచింది. అసలు ఏపీలో విద్యా శాఖ ను బొత్స సత్యనారాయణకు ఇవ్వడం కొంత చర్చనీయాంశమైన సంగతి వాస్తవం. ఆయన సీనియర్ మంత్రే అయినప్పటికీ ఎందుకనో ఆయన నియామకాన్ని అందరూ కొంత భిన్నంగా చూశారు.
ఇదేం చిత్రం? ఇదెలా సాధ్యం?ఆఖరికి ఏపీలో పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండడంతో టెన్త్ తన్నేసింది అనే విమర్శలు వస్తున్నాయి. 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఫలితాల శాతం తగ్గడాన్ని ఎద్దేవా చేస్తున్నారు.
ఇక విడుదలైన ఫలితాల్లో ఓ కొత్త చిత్రం కనిపించింది. విజయవాడకు చెందిన ఓ విద్యార్థికి మొత్తం 170 మార్కులే రావడం..అయినా అతడు పాస్ అయినట్లు పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఆరు పేపర్ల లెక్క తీసుకున్నా.. సబ్జెక్టుకు 35 చొప్పున 210 మార్కులు వస్తేనే పాస్. కానీ విద్యార్థి అంతకంటే తక్కువ స్కోర్ చేశాడు. అంతేకాదు.. సోషల్ స్టడీస్ లో 11 మార్కులు, లెక్క్లల్లో 17 మార్కులు వచ్చాయి. ఏవిధంగా చూసినా ఫెయిలే. కానీ, పాస్ అంటూ ఫలితాల్లో పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యత రీత్యా అతడి పేరును ప్రస్తావించడం లేదు. హాల్ టికెట్ చివరి నాలుగు అంకెలు మాత్రం..."3487".