సింహాలను అమ్మకానికి పెట్టిన దాయాది దేశం?Q పరిస్థితి ఇప్పుడంత బ్యాడ్!

Update: 2022-07-30 03:29 GMT
దాయాది దేశానికి సంబంధించిన షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. గడిచిన కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ లో ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారినట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పరిస్థితులు మరింత దారుణంగా మారినట్లు చెబుతున్నారు.

తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తమ వద్ద ఉన్న మృగరాజులను కారుచౌకగా అమ్మేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం లాహోర్ జూలో 12 ఆఫ్రికన్ సింహాలు ఉన్నాయి. వీటి అలనాపాలనా చూసుకోవటం తలకు మించిన భారంగా మారింది. దీంతో.. వీటిని సాకే కన్నా.. వాటిని వదిలించుకోవటం మంచిదన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చిందంటున్నారు.

అయితే.. వీటిని తీసుకునేందుకు ముందుకు రాకపోవటంతో.. వీటిని కారుచౌకగా అమ్మేయాలన్న యోచనకు వచ్చారు. షాకింగ్ అంశం ఏమంటే.. ఇప్పుడీ సింహాల ధర.. పాక్ లోని బర్రెల కంటే తక్కువ ధర పలకటం.

దీంతో ఒక్కో సింహాన్ని రూ.1.5లక్షలకు అమ్మాలని అధికారులు డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ ఆఫ్రికన్ సింహాల్ని తమతో ఉంచుకొని.. వాటి పోషణ కోసం భారీగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదని.. ఇలాంటివేళ.. వాటిని వదిలించుకోవటమే మంచిదన్న భావనకు వచ్చిన అధికారులు.. బర్రెల కంటే తక్కువ ధరకు సింహాల్ని అమ్మకానికి పెట్టారు.

ఈ ఉదంతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఒక్కో బర్రె ఖరీదు రూ.3.5 లక్షల వరకు పలుకుతున్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News