స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ చిత్ర విచిత్ర విన్యాసాలకు, కొనుగోళ్లకు ప్రతీతి. నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎలాన్ మస్క్ ఏం చేసినా అది ప్రపంచవ్యాప్తంగా ఇట్టే వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌పామ్ అయిన ట్విట్టర్ కొనుగోలులో ఎలాన్ మస్క్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ 28తో ట్విట్టర్ కొనుగోలు పూర్తవుతుందని తన సహ పెట్టుబడిదారులతో ఇప్పటికే ఎలాన్ మస్క్ చెప్పారు. దీంతో ఎప్పటి నుంచో తెగుతూ.. ముడిపడుతూ వస్తున్న ట్విట్టర్ కొనుగోలుకు ఇక మార్గం సుగమమైనట్టే అని తెలుస్తోంది.
ట్విట్టర్ కొనుగోలు ఖాయమైందన్నట్టు ఎలాన్ మస్క్ కూడా కొన్ని సంకేతాలను ఇవ్వడం గమనార్హం. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ఎలాన్ మస్క్ ప్రత్యేకంగా దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో తాను ఉన్న వీడియోను ఎలాన్ మస్క్ స్వయంగా ట్విట్టర్‌లో పోస్టు చేయడం విశేషం.
'లెట్ దట్ సింక్ ఇన్!' అంటూ ఎలాన్ మస్క్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ట్విట్టర్ కొనుగోలు డీల్ పూర్తి అయ్యిందని చెప్పడానికి అన్నట్టు సింబాలిక్‌గా 'సింక్' ను పట్టుకుని మస్క్ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు, మస్క్‌ను అనుసరించేవారు రకరకాల మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. మరోవైపు మస్క్ వీడియోకు లైకులు, కామెంట్లు, రీట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
ట్విట్టర్ కొనుగోలు డీల్ పూర్తయిందని చెప్పడానికి ఎలాన్ మస్క్ మరో సంకేతాన్ని కూడా ఇచ్చారు. తన ట్విట్టర్ బయోలో చీఫ్ ట్విట్ అంటూ మస్క్ ప్రకటించుకోవడం విశేషం.
44 బిలియన్ డాలర్లతో (భారత కరెన్సీలో సుమారు రూ.3.56 లక్షల కోట్లు) ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు ట్విటర్ కొనుగోలు తరువాత 75 శాతం ఉద్యోగులకు మస్క్ ఉద్వాసన పలకనున్నారనే వార్తలపై ఆలోచన ఏదీ లేదని ట్విటర్ ఇప్పటికే స్పష్టత నిచ్చింది. అయితే ఉద్యోగులు మాత్రం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
Full View Full View
అక్టోబర్ 28తో ట్విట్టర్ కొనుగోలు పూర్తవుతుందని తన సహ పెట్టుబడిదారులతో ఇప్పటికే ఎలాన్ మస్క్ చెప్పారు. దీంతో ఎప్పటి నుంచో తెగుతూ.. ముడిపడుతూ వస్తున్న ట్విట్టర్ కొనుగోలుకు ఇక మార్గం సుగమమైనట్టే అని తెలుస్తోంది.
ట్విట్టర్ కొనుగోలు ఖాయమైందన్నట్టు ఎలాన్ మస్క్ కూడా కొన్ని సంకేతాలను ఇవ్వడం గమనార్హం. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ఎలాన్ మస్క్ ప్రత్యేకంగా దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో తాను ఉన్న వీడియోను ఎలాన్ మస్క్ స్వయంగా ట్విట్టర్‌లో పోస్టు చేయడం విశేషం.
'లెట్ దట్ సింక్ ఇన్!' అంటూ ఎలాన్ మస్క్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ట్విట్టర్ కొనుగోలు డీల్ పూర్తి అయ్యిందని చెప్పడానికి అన్నట్టు సింబాలిక్‌గా 'సింక్' ను పట్టుకుని మస్క్ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు, మస్క్‌ను అనుసరించేవారు రకరకాల మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. మరోవైపు మస్క్ వీడియోకు లైకులు, కామెంట్లు, రీట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
ట్విట్టర్ కొనుగోలు డీల్ పూర్తయిందని చెప్పడానికి ఎలాన్ మస్క్ మరో సంకేతాన్ని కూడా ఇచ్చారు. తన ట్విట్టర్ బయోలో చీఫ్ ట్విట్ అంటూ మస్క్ ప్రకటించుకోవడం విశేషం.
44 బిలియన్ డాలర్లతో (భారత కరెన్సీలో సుమారు రూ.3.56 లక్షల కోట్లు) ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు ట్విటర్ కొనుగోలు తరువాత 75 శాతం ఉద్యోగులకు మస్క్ ఉద్వాసన పలకనున్నారనే వార్తలపై ఆలోచన ఏదీ లేదని ట్విటర్ ఇప్పటికే స్పష్టత నిచ్చింది. అయితే ఉద్యోగులు మాత్రం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.