ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన సర్కారు వారి పాటలోని 'కళావతి' పాటను ఓ లెక్చరర్ పాడిన వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాగే మరొక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తన స్టూడెంట్స్‌కు జావా లాంగ్వేజ్‌ను నేర్పించడానికి లెక్చరర్ మగధీర సినిమాలోని ఒక సన్నివేశాన్ని వాడుకోవడం ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోను లైకులు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.
జావాను తన స్టూడెంట్స్‌కు బోధించడానికి ఒక లెక్చరర్ మగధీర సినిమాలోని హెలికాప్టర్ సన్నివేశాన్ని తీసుకున్నాడు. ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ తన తండ్రిని చంపాడని హీరో రామ్‌చరణ్‌ను అసహ్యించుకుని.. తన బావతో హెలికాప్టర్‌లో వెళ్లిపోతుంది. రామ్ చరణ్ కూడా ఆ హెలికాప్టర్ ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. ఇంటిపైకి ఎక్కి ఎగిరిపోతున్న హెలికాప్టర్‌ను పట్టుకుంటాడు. ఇప్పుడు ఇదే సీన్‌ను ఒక లెక్చరర్ తన జావా క్లాసుకు వాడుకోవడం నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది.
మెయిన్ మెథడ్ (మిత్రవింద (కాజల్ అగర్వాల్))ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)గా రామ్ చరణ్‌ని లెక్చరర్ పేర్కొన్నాడు. కాల భైరవ (రామ్ చరణ్) మెయిన్ మెథడ్‌ని చేరుకుంటాడు. మెయిన్ మెథడ్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ నిష్క్రమించడానికి లెక్చరర్ రామ్‌చరణ్ హెలికాప్టర్ నుంచి పడిపోయే సీన్‌ను తన విద్యార్థులకు చూపాడు.
మగధీర జావా ట్యుటోరియల్‌కి సంబంధించిన ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఐటీ కుర్రాళ్లు ఈ వీడియోని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక లెక్చరర్ హావభావాలు, వర్డ్ టు వర్డ్ ట్రాస్లేషన్ కూడా అంతే నవ్వులు పూయిస్తున్నాయి.
కొంతమంది జావా నేర్చుకోవడానికి వేలకు వేలు ఫీజులు చెల్లిస్తూ.. నెలల తరబడి నేర్చుకునే బదులు ఈ ఒక్క వీడియో చూస్తే చాలని వెటకారంగా స్పందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View