శిక్ష అంటే మాములు విధంగా కాదు. మన ఐపీసీని మించిపోయిన శిక్ష. యావజ్జీవమూ కాదు. ఉరిశిక్ష అంతకన్నా కాదు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3,318ఏళ్ల పాటు జైలు శిక్ష. వండరో..వండర్. సూపరో.. సూపర్.అనుకుంటున్నారు కదూ! మీలో ఇదేం చోద్యమని చింతిస్తున్నారు కదూ! ఆ.. చింత మీకు వలదు. ప్రపంచచరిత్రలోనే నమోదు చేయదగ్గ సువర్ణ అధ్యాయమిది.
అతడో షూటర్. వయస్సు 27. 12 మందిని అతి కిరాతకంగా హతమర్చాడు. అమెరికాలోని డెన్వర్ లో ఓ మల్టీఫ్లెక్స్ లో చోటుచేసుకున్న ఈ ఘటన పై కొలరాడో జడ్జి ఎట్టకేలకు తీర్పు వెలువరించారు.ఇటువంటి క్రూరులకు సమాజంలో తిరిగే అర్హతే లేదని తేల్చేశారా న్యాయమూర్తి. ఇలాంటి వాళ్లను క్షమించి వదిలేస్తే, మరిన్ని అమానవీయ చర్యలకు ఊతమిచ్చినట్లవుతుందని పేర్కొంటూ తీర్పు వెలువరించి, యావత్ ప్రపంచాన్నీ ఆశ్చర్యంలోపడేశారు.
దీనిపై మన పౌరహక్కుల సంఘాలు ఏమంటాయో? లక్ష కోట్లు దోచుకున్న మన నాయకులు ఏడాదికి పైగా జైల్లో ఉంటేనే అన్యాయం అని మన నాయకులు గగ్గోలు పెడతారు. అట్టాటింది ఒకటి కాదు రెండు ఏకంగా 3,318 ఏళ్లు అంటే.. మాటలా.. ఎన్ని లైఫ్ లు వేసి ఉండాలి. మనదేశంలో లైఫ్ టైం ఇంప్రిజన్ మెంట్ అంటే ఐతే 14ఏళ్లు లేక పోతే 20 ఏళ్లు. అదీ నేర తీవ్రత ఆధారంగా.. ఈ లెక్కన చూసుకుంటే అతడికి 237 సార్లు యావజ్జీవ శిక్ష పడినట్టే..మరి అమెరికా పౌరహక్కుల సంఘాలు ఈ లెక్కన ఎంత గగ్గోలు పెట్టాలి.