అమెరికాలో కాల్పులు: వర్జీనియా వర్సిటీలో 3 విద్యార్థుల మృతి

Update: 2022-11-15 07:37 GMT
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  వర్జీనియా యూనివర్శిటీ ఫుట్‌బాల్ జట్టులో ముగ్గురిని కాల్చి చంపి ఇద్దరిని గాయపరిచిన సాయుధుడు ఆదివారం రాత్రి పరారీలో ఉన్నాడు. అతను సాయుధుడు అని.. ఆయుధాలు ఉన్నాయని, ప్రమాదకరమైనవాడు అని స్థానికులు తెలిపారు.

అయితే, కౌంటీలో భారీ కూంబింగ్ ఆపరేషన్ల తర్వాత పోలీసులు క్రిస్టోఫర్ డార్నెల్ జాన్సన్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్‌లోని కల్‌బ్రేత్ రోడ్ ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినిపించాయని పోలీసులు ప్రకటించే సమయానికి స్థానిక కాలమానం ప్రకారం 10.30 అవుతోంది.. క్యాంపస్ పోలీసుల ప్రకారం జాన్సన్ అనే నల్లజాతీయుడు బుర్గుండి జాకెట్, బ్లూ జీన్స్ మరియు ఎరుపు బూట్లు ధరించి ఈ కాల్పులు జరిపాడని చెబుతున్నారు.

ఇతడు తల్లికి దూరంగా  తన అమ్మమ్మ వద్ద పెరిగాడని.. అతని గురించి స్థానికులకు  ఏమీ తెలియదని సమాచారం.

కాల్పులకు సంబంధించి పోలీసులు ఇంతవరకు సరైన కారణాలను వెల్లడించలేదు. ఇప్పుడు షూటర్‌ను పట్టుకున్నారు,

ముగ్గురు తెలివైన, మంచి విద్యార్థులను కోల్పోయినందుకు స్థానిక సంఘం సంతాపం తెలిపింది. ఈ ఏడాది జరిగిన 600 సామూహిక కాల్పుల్లో వర్జీనియా కాల్పులు ఒకటి. గాయపడిన విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని.. మరొకరి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

వర్జీనియా యూనివర్సిటీ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పట్ల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంతాపం తెలిపారు. ఈ కాల్పుల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News