వింత స‌మ‌స్య‌: వ్యాక్సిన్ ప్ర‌యోగానికి కోతుల కొర‌త‌

Update: 2020-06-20 13:30 GMT
వైర‌స్ వ్యాపించింది.. అన్ని దేశాల్లో తీవ్రం దాల్చింది. ఈ స‌మ‌యంలో అన్ని దేశాలు ప్ర‌జ‌లు స‌హ‌జీవ‌నం చేయాల్సిందేన‌ని చెప్పాయి. ఈ నేప‌థ్యంలో పాజిటివ్‌ కేసులు భారీస్థాయిలో న‌మోద‌వుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటికి చేరువ‌లో కేసులు ఉన్నాయి. ఒక‌ప‌క్క వైర‌స్ విజృంభ‌ణ‌.. దాడి కొన‌సాగుతుండ‌గా మ‌రోప‌క్క ఆ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీంతోపాటు వైర‌స్ నిరోధానికి విరుగుడుగా మందు క‌నిపెట్టే ప్ర‌య‌త్నాలు తీవ్రంగా జ‌రుగుతున్నాయి. వ్యాక్సిన్ క‌నిపెట్టేందుకు ఎన్నో వైద్య సంస్థ‌లు, శాస్త్ర‌వేత్త‌లు, విశ్వ‌విద్యాల‌యాలు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌నిపెట్టేందుకు అన్ని దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ త‌యారీలో కొన్ని దేశాలు ముందంజ‌లో ఉన్నాయి. భార‌త్ కూడా ముందు వ‌రుస‌లో ఉంది. అయితే వ్యాక్సిన్ క‌నిపెట్టారు కానీ మ‌నుషుల‌పై ప‌ని చేస్తుందో లేదో తెలియ‌డానికి ప్ర‌యోగాలు చేయాల్సి ఉంది.

అయితే నేరుగా మానవుల‌పై ప్ర‌యోగాలు చేస్తే చ‌నిపోయే ప్ర‌మాదం కూడా పొంచి ఉంది. అందుకే మందులు త‌యారు చేసిన‌ప్పుడు జంతువుల మీద ప్ర‌యోగాలు చేస్తారు. మాన‌వ పుట్టుక కోతి నుంచి వ‌చ్చిందే. అందుకే కోతుల‌పై తొలుత ప్ర‌యోగాలు చేస్తారు. అయితే ఈ ప్ర‌యోగాల‌కు కోతుల కొర‌త ఏర్ప‌డింది. దీంతో ప్ర‌యోగాలు చేయ‌డానికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌రిస్థితి చైనా వారికి వ‌చ్చింది. టీకా కొనుగొనేందుకు ఆ దేశంలో జోరుగా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో చైనా ప‌రిశోధ‌న‌శాల‌ల‌లో వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు చేప‌ట్టేందుకు కోతులు దొర‌క‌డం లేద‌ట‌. ఒక‌వేళ దొరికినా వాటి ధ‌ర అధికంగా ఉంద‌ని తెలుస్తోంది. దీంతో వ్యాక్సిన్ ప్ర‌యోగానికి ఆటంకం ఏర్ప‌డుతోంది.

పలు ఫార్మా కంపెనీలు వైర‌స్‌కు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. ఎలుక‌లు, కుందేళ్ల‌పై ఇప్ప‌టికే ల్యాబ్‌ల్లో ప‌రీక్ష‌లు ముగిశాయి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్‌ను కోతుల‌పై ప‌రీక్షించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. యిషెంగ్ అనేక ఫార్మా కంపెనీ భారీ స్థాయిలో వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు మొద‌లుపెట్టింది. సెప్టెంబ‌ర్‌లోపు వ్యాక్సిన్ తీసుకురావాల‌ని ల‌క్ష్యం విధించుకుని ప్ర‌యోగాలు చేస్తున్నారు. అయితే కోతులు ల‌భించ‌క‌పోవ‌డంతో వ్యాక్సిన్ తీసుకురావ‌డం ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News