ఓపెన్ చేసిన 4 గంటల్లోనే వేయాలి ..లేకపోతే ?

Update: 2021-01-20 12:30 GMT
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16 న ప్రారంభమై , శరవేగంగా కొనసాగుతుంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అత్యవసర వినయోగం నిమిత్తం భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకా లకు ఆమోదం లభించం తెలిసిందే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతుంది.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరిలో మాత్రమే, చిన్న చిన్న ఉత్పన్నం అయ్యాయి. త్రీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పటివరకు కలగలేదు. అయితే ఇంకా కొందరిలో మాత్రం అపోహలు అలాగే కొనసాగుతున్నాయి. నిపుణులు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు అని చెప్తున్నారు.

ఇదిలా ఉంటే .. ఈ వ్యాక్సిన్ వాడకం పై వైద్య నిపుణులు కొన్ని కీలక సూచనలు చేశారు. ఒకసారి సీలు తెరచిన టీకా సీసా లోని వ్యాక్సిన్ ను కేవలం 4 గంటల్లోనే ఉపయోగించాలని లేకపోతే అవి నిర్వీర్యం అయిపోతాయని అని అన్నారు. ప్రతి 5 ml వ్యాక్సిన్ సీసా 10 డోసులని కలిగి ఉంటుంది అని ,ఒక్కసారి ఆ సీసా తెరచిన వెంటనే 4 గంటల్లోనే ఆ సీసా లోని డోసులని వాడేయాలని , లేకపోతే వాటిని వినియోగించకూడదు నాశనం చేయాలన్నారు.
Tags:    

Similar News