అంద‌రి చూపూ.. చంద్ర‌బాబు వైపు.. రీజ‌నేంటంటే!

Update: 2021-07-03 11:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైపు ఇప్పుడు అంద‌రి దృష్టీ ప‌డింది. అత్యంత కీల‌క స‌మ‌యంలో చంద్ర‌బా బు మౌనంగా ఉండ‌డంపై స‌ర్వ‌త్రా విస్మయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో చంద్ర‌బాబు గురించి.. ఇటు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లోనూ.. అటు మేధావి వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ``ఇది.. ఏపీ ప‌రంగా చూసుకుంటే.. ఇప్పుడు అత్యంత కీల‌క స‌మ‌యం. ఎంతో అనుభ‌వం ఉన్న నాయ‌కుడిగా.. చంద్ర‌బాబు స‌రైన స‌మ‌యంలో స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది.`` అని మేధావులు అంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌స్తుతం జ‌ల వివాదాలు తార‌స్థాయికి చేరాయి. ముఖ్యంగా ఏపీలో ఖ‌రీఫ్‌సాగు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో రైతుల‌కు చుక్క‌నీరు లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ప్రాజెక్టులు నిండ కుండానే.. తెలంగాణ చేస్తున్న దూకుడు ప్ర‌య‌త్నం కార‌ణంగా.. ఏపీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంది. శ్రీశైలం వ‌ద్ద‌.. తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్న కార‌ణం.. వంద‌ల టీఎంసీల నీరు స‌ముద్రంలోకి పోతోంది. అదేస‌మ యంలోపులిచింత‌ల స‌హా ప‌లు ప్రాజెక్టుల్లోనూ కేటాయింపుల‌కు మించి.. తెలంగాణ నీటిని వాడుతోంది. దీనిపై సీఎం జ‌గ‌న్‌.. కేంద్రానికి లేఖ‌లు రాస్తున్నారు.

మ‌రి ఈ సమ‌యంలో స్పందించాల్సిన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏమ‌య్యారు?  ఎక్క‌డ ఉన్నారు? అనేది కీల‌క ప్ర‌శ్నగా మారింద‌ని అంటున్నారు మేధావులు. ``అనేక విష‌యాల‌పై చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇప్పుడు కీల‌కంగా మారిన జ‌లాల విష‌యంలో ఎందుకు స్పందించ‌డం లేదు`` అని నిపుణులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌లాల విష‌యంలో ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చినా.. మంచిదేన‌ని, ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌ధ్య ఇవే చ‌ర్చ‌కు వ‌స్తాయ‌ని.. త‌ద్వారా.. పొలిటిక‌ల్‌గా కూడా ఆయ‌న‌కు మేలు జ‌రుగుతుంద‌ని కొంద‌రు అంటున్నారు.

అయితే.. జ‌ల వివాదాలు తార‌స్థాయికి చేరుకుని.. ప్రాజెక్టుల వ‌ద్ద ఆంక్ష‌లు విధించే ప‌రిస్థితి వ‌చ్చినా.. చంద్ర‌బాబు మౌనంగానే ఉన్నారు. ఈ ప‌రిణామం మంచిది కాద‌ని.. ఇత‌ర‌త్రా ఇప్ప‌టికే అనేక అంశాల‌పై
స్పందించి.. నిత్యం జ‌నాల్లోనే ఉన్న చంద్ర‌బాబు.. కీల‌క‌మైన జ‌లాల విష‌యంలో స్పందించ‌క‌పోవ‌డం.. రాబోయే రోజుల్లో విమ‌ర్శ‌ల‌కు దారితీస్తుంద‌ని.. ఇలాంటి స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తే.. స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుందో.. ఆయ‌న సూచ‌న‌లు చేయొచ్చుక‌దా? అని అంటున్నారు ప‌రిశీల‌కులు. మరి చంద్ర‌బాబు ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News