ప్రిజ్‌లో ప్రేయసి శవం ముక్కలు.. మరొకరితో సెక్స్.. వీడెంత దుర్మార్గుడంటే!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వికాస్ వాకర్ హత్య కేసులో దిగ్భ్రాంతి గొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ ఓ పక్క ప్రియురాలి శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో ఉంచాడు. ఇంతలోనే మరో యువతిని తన ఫ్లాట్‌కు పిలిచి ఆమెతో పదే పదే సెక్స్ చేశాడు. అంతేకాదు.. మరో వైపు ఓ వెబ్‌సిరీస్‌ను, ఇంటర్నెట్‌లో చదవి శవాన్ని ఆనవాళ్లు లేకుండా మాయం చేశాడని పోలీసులు గుర్తించారు.
డేటింగ్ యాప్‌ను వాడిని పలువురు మహిళలను కూడా అతడు కలిసినట్లు తెలుస్తోంది. అతడి మిత్రులు.. పుడ్ డెలివరీ బాయ్స్, ఇతరులు తరచూ అతడి ఇంటికి వస్తున్నా.. ఇంట్లో కొన్నాళ్ల నుంచి మృతదేహం విడిభాగాలు ఉన్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త వహించాడు.
నిందితుడు అఫ్తాబ్ ‘డెక్స్‌టర్’ పేరిట వచ్చే ఓ సీరియల్ కిల్లర్ ఆంగ్ల వెబ్‌సిరీస్, ఇతర క్రైం సిరీస్‌లను చూసేవాడు. మే 18వ తేదీన శ్రద్ధా-అఫ్తాబ్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అఫ్తాబ్ ఆమెను గొంతు కోసి చంపాడు. అనంతరం అతడు చూసే క్రైమ్ షోల్లో లాగా ఆమె మృతదేహాన్ని నరికి ఫ్రిజ్‌లో భద్రపర్చాడు. శరీరాన్ని ముక్కలు చేయడం కోసం అతడు హ్యూమన్ అనాటమీని చదివాడు. ఇంట్లో ఎటువంటి వాసన రాకుండా రోజూ అగర్‌బత్తీని వెలిగించేవాడు.
ఫ్రిజ్‌లో దాచిన ఆమె ముఖాన్ని అప్పుడప్పుడు తీసి చూసేవాడు. ఆ ముఖంపై ఉమ్మేసేవాడు. తప్ప తాగే ముందు ఆమె ముఖాన్ని ఎదురుగా పెట్టుకుని పాటలు పాడేవాడు. త్వరగా దెబ్బతింటున్న శరీర భాగాలను తొలుత పారేసేవాడు. పోలీసులు అతడు వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకొన్నారు. రక్తాన్ని ఎలా శుభ్రం చేయాలి, మానవశరీర నిర్మాణం ఎలా ఉంటుంది అనే అంశాలను అతడు చదివినట్లు గూగుల్ హిస్టరీలో బయటపడింది.
శ్రద్ధా శవం ఇంట్లోని ఫ్రిజ్లో ఉండగానే అఫ్తాబ్ మరో యువతిని తన అపార్ట్‌మెంట్‌కు రప్పించాడు. అఫ్తాబ్ ఈ విషయాన్ని విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఓ ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొన్నాడు. గతంలో ఇదే యాప్‌లో శ్రద్ధాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ యాప్‌లోనే మరో యువతికి ఎరవేశాడు. ఆమె ఓ సైకాలజిస్టు. ఆమె జూన్, జులైలో పలు మార్లు అతడి ఇంటికి వచ్చి సెక్స్‌లో పాల్గొంది. అప్పటికి ఆ అపార్ట్‌మెంట్ కిచెన్‌లోని ఫ్రిజ్‌లో శ్రద్ధా శరీర ముక్కలు ఇంకా ఉన్నాయి.
మరోవైపు శ్రద్ధా సజీవంగా ఉందని అందరినీ నమ్మించేందుకు అఫ్తాబ్ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లోకి లాగిన్ అయ్యేవాడు. దీంతోపాటు ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేవాడు. కొన్ని సందర్భాల్లో ఆమె మిత్రులకు మెసేజ్‌లు చేసేవాడు. కాకపోతే ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, సోషల్‌మీడియాలో అప్‌డేట్లు లేకపోవడం వంటి వాటితో శ్రద్ధా మిత్రులకు అనుమానం వచ్చి ఆమె ఇంట్లో తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.