రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష మరణానికి సంబంధించి పోలీసులకు మరింత క్లారిటీ వచ్చిందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. శిరీషది సూసైడ్ కాదు.. హత్య అని ఆమె తరఫు బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్న వేళ.. ఆమె మరణానికి కారణంగా భావిస్తున్న నిందితులు రాజీవ్.. శ్రవణ్ లను పోలీసులు విచారించిన వైనం తెలిసిందే.
పోలీసుల కస్టడీలో ఉన్న ఈ ఇద్దరూ కుకునూరుపల్లి ఎస్ ఐ వద్దకు వెళ్లటం.. తిరిగి రావటం.. శిరీష మరణానికి దారి తీసిన పరిస్థితుల గురించి వివరించినట్లు తెలుస్తోంది. తాజా విచారణలో వెల్లడైన మరో కొత్త విషయం ఏమిటంటే.. శిరీషను.. తేజస్విని వదిలించుకోవాలని రాజీవ్ భావించటం. వీరిద్దరిని వదిలించుకొని వేరే అమ్మాయితో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ కావాలని అతను అనుకున్నట్లుగా పోలీసుల విచారణలో బయటపడిందని చెబుతున్నారు.
పోలీసుల విచారణలో కుకునూరుపల్లి ఎస్ ఐ వద్దకు తాము వెళ్లటం.. అక్కడ శిరీషపై అత్యాచార యత్నం జరిగిన వైనాన్ని వారు మరోసారి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎస్ ఐ అత్యాచార యత్నం చేసిన సమయంలో తాము క్వార్టర్ బయటే ఉన్నట్లుగా రాజీవ్.. శ్రవణ్ లు చెప్పినట్లుగా సమాచారం.
కుకునూరుపల్లి నుంచి తిరిగి వచ్చే సమయంలో శిరీషను తాము దారుణంగా కొట్టి హింసించినట్లుగా వారు ఇరువురు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమె ఆత్మాభిమానానికి.. గౌరవానికి భంగం కలిగేలా ఈ ఇద్దరూ వ్యవహరించిన వైనం తాజా విచారణలో బయటకు వచ్చినట్లుగా సమాచారం. ఇది తట్టుకోలేని శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాజీవ్.. శ్రవణ్ లు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాను గతంలో కుకునూరు ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి కొందరు కాల్ గర్ల్స్ ను పంపిన వైనాన్ని శ్రవణ్ ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. కేసులో ఇరుక్కుంటానన్న ఉద్దేశంతోనే కుకునూరుపల్లి ఎస్ ఐ ఆత్మహత్య చేసుకొని ఉంటారని నిందితులు చెప్పినట్లుగా తెలుస్తోంది. శిరీషను చంపాల్సిన అవసరం తనకు లేదని రాజీవ్ స్పష్టం చేసినట్లుగా సమాచారం. శిరీషను.. తేజస్విని వదిలించుకోవాలని మాత్రం తాను అనుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాను సెటిల్ మెంట్ కు సిద్ధమైనట్లుగా చెప్పినట్లు సమాచారం. కస్టడీలో ఉన్న నిందితులు వెల్లడించిన సమాచారంతో వారిపై ఇప్పటికున్న సెక్షన్లకు అదనంగా ఐపీసీ 324.. 364.. 509 సెక్షన్లను జత చేసినట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/