ఉత్తరప్రదేశ్... ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం - ఆ తర్వాత ఆదిత్యనాథ్ యోగీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... అక్కడి బీజేపీ నేతలకు ఎక్కడ లేని బలం వచ్చేసింది. మోరల్ పోలీసింగ్ పేరిట సీఎం పేరు చెప్పుకుని బీజేపీ నేతలు నానా బీభత్సం చేసిన ఘటనలూ మనం చూశాం. ఆ తరహాలోనే ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు నడిరోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతుండగా... ఓ మహిళా పోలీసు అధికారి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అధికార పార్టీ నేతలమన్న ధీమాతో సదరు నేతలంతా ఒంటరిగానే రోడ్డుపైకి వచ్చిన మహిళా పోలీసు అధికారిని భయకంపితులను చేసేందుకు యత్నించారు. ఆమెను రౌండప్ చేసి భయపెట్టేందుకు యత్నించారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే పులి ముందే పిల్లిమొగ్గలేస్తారా? అంటూ ఆ లేడీ పోలీస్... నడిరోడ్డుపై వారిని ఒంటి చేత్తో లెంపలేయించింది. ఇక అసలు విషయంలోకి వెళితే... బులంద్ షహర్ లో సర్కిల్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్న పోలీసు అధికారిణి శ్రేష్ఠ ఠాకూర్... రోడ్డుపై డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే తిరుగుతున్న కొందరిని పట్టుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేస్తున్నందుకు వారికి జరిమానా విధించేందుకు ఆమె సిద్ధపడ్డారు.
అయితే అధికార పార్టీకి చెందిన తమకే ఫైన్ వేస్తారా? అంటూ ఆ పార్టీ నేతలు... ఆమెను రౌండప్ చేశారు. అటొకరు - ఇటొకరు - ఇంకోవైపు ఇంకొకరు నిలబడి చుట్టూ ఆమెతో వాగ్వాదానికి దిగుతూ... ఆమెకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే ఈ అరుపులు, కేకలకు ఏమాత్రం బెదరిని ఠాకూర్... ఎక్కువగా అరిస్తే మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తానని నవ్వుతూనే చెప్పడంతో వారంతా కంగు తిన్నారు. ఇంతగా భయపెడుతున్నా... ఠాకూర్‌లో ఇసుమంత కదలిక కూడా లేకుండా తమపైనే కేసులు నమోదు చేస్తాననడం, అంతేకాకుండా మరిన్ని సెక్షన్లు నమోదు చేస్తాననడం చూసి బీజేపీ నేతలు నోరు మూయక తప్పింది కాదు.
ఆ తర్వాత వారికి క్లాస్ పీకేందుకు సిద్ధమైన ఠాకూర్... *డ్రైవింగ్ లైసెన్సులు లేకుండానే రోడ్లపైకి వాహనాలు తీసుకుని రావచ్చంటూ మీ సీఎంను ఆదేశాలు ఇవ్వమనండి, నేను మిమ్మల్ని వదిలేస్తాను. వాహనాలను చెక్ చేసే అధికారం పోలీసులకు లేదని మీ సీఎం నుంచి రాయించుకుని రండి. అప్పుడు నేను వాహనాలను చెక్ చేయను. నడి రేయిలో మా కుటుంబాలను వదిలి రోడ్లపైకి వస్తున్నది ఏదో తమాషా కోసం అనుకుంటున్నారా? మాకు అప్పగించిన విధులు నిర్వర్తించేందుకే వస్తున్నాం. మీ ప్రవర్తనతో మీ పార్టీకి మీరే చెడ్డపేరు తెస్తున్నారు. ఇలాగే ప్రవర్తిస్తే మిమ్మల్ని జనం బీజేపీ గూండాలు అంటారు* అంటూ ఠాకూర్ గుక్క తిప్పుకోకుండా వాయించేయడంతో అప్పటిదాకా చిందులు తొక్కిన బీజేపీ నేతలు కాస్తా గమ్మున అయిపోయారు. ఠాకూర్ రాసిన కేసుల మేరకు ఫైన్ కట్టేసి వెళ్లిపోయారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/