‘కరోనా వారియర్’​.. కళ్లముందే కన్నుమూశాడు..!

Update: 2020-11-26 16:30 GMT
అతడో యువడాక్టర్​. కరోనా రోగులను కంటికి రెప్పలా కాపాడాడు. ఎందరో కరోనా పేషెంట్లకు చికిత్సనందించాడు. చివరకు అదే కరోనాకు బలయ్యాడు. అవయవమార్పిడి చేయాలని భావించిన వైద్యుల ఫలితాలు ఫలించలేదు. నివర్​ తుఫాన్​ ధాటికి విమానాలు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో వైద్యులు కళ్లముందే కన్నుమూశాడు. అతడి చేసిన కృషిని యావత్​ భారతదేశం కొనియాడుతున్నది. మధ్యప్రదేశ్‌కు చెందిన శుభం ఉపాధ్యాయ్​ (30).. బుంధేల్​ఖండ్​ మెడికల్​ కళాశాలలో కాంట్రాక్ట్​ డాక్టర్​గా పనిచేస్తున్నాడు. లాక్​డౌన్​ సమయం నుంచి అనేకమంది కోవిడ్​ రోగులకు చికిత్సనందించాడు. ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ అక్టోబర్​ 28న అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

ఈ క్రమంలో తోటి వైద్యులు చికిత్స ప్రారంభించారు. కానీ శుభం ఉపాధ్యాయ్​ శరీరం వైద్యానికి సహకరించడం లేదు. అతడి ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయి.

చివరకు భోపాల్​లోని చిరాయు మెడికల్​ కళాశాలకు తీసుకెళ్లారు. అయినప్పటికి అతడు కోలుకోలేదు.నవంబర్​ 10 నాటికి శుభం ఆరోగ్యపరిస్థితి మరింత విషమించింది. ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని అతడికి అవయవ మార్పిడి చేయాలని వైద్యులు భావించి.. వెంటనే చైన్నై ఆస్పత్రికి ఎయిర్​లిఫ్ట్​ చేయాలని భావించారు.

కానీ నివర్​ తుఫాన్​తో తమిళనాడుకు విమానాలు వెళ్లే పరిస్థితి లేదు. విషయం తెలుసుకున్న సీఎం శివరాజ్​సింగ్​ అతడిని చెన్నై తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. చివరకు గురువారం రాత్రి శుభం ఉపాధ్యాయ్​ తుదిశ్వాస విడిచారు.కేవలం వాతావరణం అనుకూలించకపోవడంతో ఓ గొప్ప కరోనా వారియర్​ను కోల్పోయామని సీఎం శివరాజ్​ చౌహాన్​ పేర్కొన్నారు. తోటి వైద్యులు కూడా శుభం మృతికి సంతాపం తెలిపారు.
Tags:    

Similar News