త‌స్లీమా మాట‌పై ముస్లింలు ఏమంటారు?

Update: 2016-03-13 17:30 GMT
బంగ్లాదేశ్ ర‌చ‌యిత్రి త‌స్లీమా న‌స్రీన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె వ్యాఖ్య‌లు కానీ.. ముస్లిం మ‌త‌పెద్ద‌లు సీరియ‌స్ గా తీసుకొని.. ఆ సూచ‌న‌ల్ని మార్పుల దిశ‌గా ప్ర‌య‌త్నిస్తే ప‌రిస్థితి మొత్తం మారిపోయే అవ‌కాశం ఉంది. ముస్లింలు నిత్యం ఐదుసార్లు చేసే ప్రార్థ‌న‌ల విష‌యంలో ఆమె చేస్తున్న సూచ‌న ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ప్రార్థ‌న‌లు చేసేది ముస్లింలు ఒక్క‌రు మాత్ర‌మే కాద‌ని.. అంద‌రూ చేస్తార‌ని.. పాఠ‌శాల‌లు.. ఆఫీసులు.. ఎయిర్ పోర్ట్ లు.. మార్కెట్ వంటి బ‌హిరంగ స్థ‌లాల్లో ప్రేయ‌ర్ రూముల్ని బ్యాన్ చేయాల‌ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌ర్మ‌నీలోని విశ్వ‌విద్యాల‌యాల్లో ప్రేయ‌ర్ రూముల్ని నిషేధించ‌టంపై ముస్లింలు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టాన్ని ఆమె త‌ప్పు ప‌ట్టటం గ‌మ‌నార్హం.

అంద‌రికి మ‌త‌విశ్వాసాలు ఉన్న నేప‌థ్యంలో.. ముస్లింలు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప్రేయ‌ర్ చేయ‌టం ఏమిట‌ని అడుగుతున్న ఆమె.. ఇప్ప‌టివ‌ర‌కూ 5సార్లు చేసే న‌మాజ్ ను రోజుకు ఒక్క‌సారికి కుదించాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు. ఎవ‌రైనా న‌మాజు చేసుకోవాల‌నుకుంటే వారి.. వారి ఇళ్ల‌ల్లో చేసుకోవాలే కానీ.. ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించ‌టాన్ని ఆమె వ్య‌తిరేకిస్తున్నారు.

గ‌తంలో ముస్లింలు రోజుకు 50సార్లు న‌మాజులు చేసే వార‌ని.. ప్ర‌వ‌క్త రెక్క‌ల గుర్రంపై స్వ‌ర్గానికి వెళ్లి.. దైవాన్ని క‌లిసి ఆ సంఖ్య‌ను ఐదుకు త‌గ్గించాల‌ని కోరి.. అలా మార్పు చేశార‌ని గుర్తు చేశారు. నేటి కాలానికి త‌గిన‌ట్లుగా.. ఇప్పుడు ఐదుసార్లు చేసే ప్రార్థ‌న‌ను.. రోజుకు ఒక్క‌సారికి కుదించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని ఆమె చెబుతున్నారు. త‌స్లీమా మాట‌ల‌పై ముస్లిం లోకం ఎలా రియాక్ట్ అవుతుందో?
Tags:    

Similar News