గత కొద్దికాలంగా పోలీసుల శాఖలో చోటుచేసుకుంటున్న మిస్సింగ్‌ల పర్వంలో మరో ఘటన తోడయింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ ఎస్సై నాగరాజు మిస్ అయ్యారు. ఆచూకీ తెలియకపోవడంతో ఉత్కంఠత నెలకొంది. శనివారం ఉదయం కూడా ఎస్సై నాగరాజు విధులకు హాజరుకాలేదు. వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం జవహార్‌నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సీఐ - ఎస్సైలతో ఏసీపీ సమావేశానికి పోలీస్ వ్యాన్ లో వెళ్లారు. అయితే అక్కడ జరుగుతున్న మీ టింగ్ లోనుంచి ఆరోగ్యం బాగలేదని ఎస్సై నాగరాజు బయటకు వచ్చి.. మరో ఎస్సై వెంకట్ రెడ్డి ద్విచక్రవాహనాన్ని తీసుకుని నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి డ్రెస్ మార్చుకుని ఉప్పల్‌లోని ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అక్కడి నుంచి నాగరాజు మిస్సింగ్ అయ్యారు. అధికారిక సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉంది.
ఇన్ స్పెక్టర్ జగదీష్ చందర్ వివరాల ప్రకారం.. ఎస్సై నాగరాజుకు కొన్ని రోజుల కిందట బాలాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అవుతున్నట్లు సమాచారం అందింది. అక్కడికి వెళ్లడానికి నాగరాజుకు ఆసక్తి లేనట్లు సమాచారం. నాగరాజు కుటుంబసభ్యులతో కొన్నిరోజులుగా పని ఒత్తిడి ఉన్నట్లు తెలిపాడని అన్నారు. ప్రస్తుతం నాగరాజు ఆచూకీ కోసం కుంటుంబ సభ్యులతో పాటు నేరేడ్ మెట్ పోలీసులు గాలిస్తున్నారు. అధికారుల వేధింపులా - పనిభారమా కారణం ఏదైనా.. ఎస్సై నాగరాజు అదృశ్యం పోలీస్ వర్గాలను కలవరపరుస్తోంది.