కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ సర్కారు ఉంటుందా? ఊడుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్–జేడీఎస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ముంబయిలో మకాం వేయడంతో విదేశీ పర్యటనలో ఉన్న సీఎం కుమారస్వామి హుటాహుటిన బెంగళూరుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలు నిర్వహించి మంత్రులతో రాజీనామా చేయించారు. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కే సీఎం పదవి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు పట్టుబట్టారు. ఈక్రమంలో సీఎల్పీ నేతగా ఉన్న సిద్ధరామయ్య - మాజీ మంత్రి రామలింగారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ అసంతప్త ఎమ్మెల్యే - మాజీ హోంమంత్రి రామలింగారెడ్డిని సీఎంని చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు కూడా వెలువడ్డాయి.
కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక సీఎం కుమారస్వామి రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ రహస్య ప్రాంతంలో వీరు సమావేశం కావడం ఆసక్తి రేపింది. కాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీమంత్రి, బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని - ఆయన కుమార్తె సౌమ్యారెడ్డిని శనివారం రాత్రి కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కలిసి రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే రామలింగారెడ్డి తనకు జరిగిన అన్యాయంతో పాటు పార్టీలో నెలకొన్న సమస్యలనూ చెబుతూ రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పడంతో వేణుగోపాల్ నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు పార్టీలో జరుగుతున్న అనూహ్య మార్పులు తనను ఆవేదనకు గురి చేశాయని, దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని వివరించారు.
కాంగ్రెస్ – జేడీఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మంత్రిమండలి మొత్తం రాజీనామా చేయాలని తీర్మానించారు. ఈక్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సీఎంగా సిద్ధరామయ్యకు అవకాశం ఇచ్చి.. డిప్యూటీ సీఎంగా హెచ్ డీ రేవణ్ణకు ఇస్తే సరిపోతుందని మాజీ ప్రధాని దేవెగౌడ అభిప్రాయపడినట్లు సమాచారం. ఈమేరకు కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లోని అసంతృప్తులను బుజ్జగించాలంటే సిద్ధరామయ్యకు పదవి కట్టబెట్టాల్సిందేనని దేవెగౌడ యోచిస్తున్నట్లు తెలిసింది. కాగా రెండు రోజుల క్రితం దేవెగౌడ మాట్లాడుతూ సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇచ్చే అవకాశం లేదని.. అదే జరిగితే తాము మద్దతు ఉపసంహరించుకుంటామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.