చాలామందికి తాము చేసిన తప్పులు అస్సలు కనిపించవు. నిజానికి తాము చేస్తున్నది తప్పుగా అస్సలు ఫీల్ కారు. కానీ.. అలాంటి వైఖరితో వారికి ఇబ్బంది లేకున్నా.. ప్రజల్లో ఏహ్యభావం కలిగే ప్రమాదం ఉందని.. అంతిమంగా తనను.. తాను ప్రాతినిధ్యం వహించే పార్టీని నష్టం వాటిల్లేలా చేస్తుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇలాంటి విషయాల్ని లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
తరచూ వివాదాలతో సహజీవనం చేస్తున్నట్లు ఉండే ఆయన వైఖరి.. తాజాగా ఆయన మరోసారి అడ్డంగా బుక్ అయినట్లు కనిపిస్తోంది. ఆ మధ్యన ఖరీదైన వాచీని గిఫ్ట్ గా తీసుకొన్న ఆయన.. తర్వాత కాకి వాలిందని కారునే మార్చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా వచ్చే వివాదాలు సరిపోవన్నట్లు.. తనకు తానుగా విమర్శల ఊబిలోకి దిగిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. ప్రతిఒక్కరూ వేలెత్తి చూపించేలా ఉందని చెప్పాలి.
ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి మైసూర్ వచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య బయలుదేరుతుండగా ఆయన కాలి షూ లేసులు విడిపోయాయి. దీన్ని గుర్తించిన ఒకరు.. కిందకు వంగి ఆయన షూలేసుల్ని కట్టారు. ఈ చర్యను సీఎం అడ్డుకోకపోవటమే కాదు.. దర్జాగా కట్టించుకునన వైనం కెమేరాల్లో రికార్డు అయిపోయింది. ఇది పెద్ద వార్తాంశంగా మారి.. ఛానళ్లలోనూ.. పత్రికల్లోనూ.. సోషల్ మీడియాలోనూ ప్రసారం కావటంతో ప్రతిఒక్కరూ దీన్ని తప్పు పడుతున్నారు.
లేసులు కట్టించుకున్న వ్యవహారంపై ఎంత భారీగా విమర్శలు వెల్లువెత్తాయనటానికి నిదర్శనం ఏమిటంటే.. ముఖ్యమంత్రి కార్యాలయమే స్వయంగా ప్రెస్ రిలీజ్ విడుదల చేయటం. ముఖ్యమంత్రి షూ లేసుల్ని కట్టింది ప్రభుత్వ ఉద్యోగి కాదని.. ముఖ్యమంత్రి బంధువు అంటూ వెల్లడించారు. ఎవరైతేనేం.. ఇప్పుడున్న కాలంలో సింప్లిసిటీకి పెద్దపీట వేస్తున్నవేళ.. దర్జాగా.. దర్పంతో వ్యవహరిస్తే.. అలాంటి వాటిని భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్న విషయం సిద్ధరామయ్యకు అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోవటం ఖాయమన్నవిమర్శలు వినిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/