పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో రాజకీయం రసకందాయంలో పడుతోంది. ఉత్కంఠభరిత పోరులో బీజేపీ, కాంగ్రెస్-జేడీఎస్ కూటమిల మధ్య అనేక ఎత్తుగడలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బలపరీక్షకు ముందే కర్ణాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే , ఆయన సర్కారు ఎంతకాలం ఉంటుందో అనే సందేహాం ఇటు బీజేపీ వర్గాల్లో..అటు జేడీఎస్- కాంగ్రెస్ కూటమిలో కూడా ఉందనేది నిజం. అలా చర్చోపచర్చలు జరుగుతున్న సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని తన మనసులోని మాటను చెప్పారు! తద్వారా ఇటీవల జరుగుతున్న చర్చకు అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు.
హసన్‌లో జరిగిన మీటింగ్‌లో సిద్ధరామయ్య మాట్లాడుతూ ``ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనుకున్న సీట్లను గెలుచులేకపోయాము. కానీ మీ ఆశీర్వాదం ఉంటే మరోసారి కర్ణాటకకు సీఎంను అవుతా`` అని సిద్ధరామయ్య చెప్పారు. జేడీయూతో చేతులు కలపడం వల్లే తాను సీఎం కాలేకపోయానని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని భవిష్యత్తులో మళ్లీ సీఎం అవుతానని సిద్ధరామయ్య అన్నారు. కాగా, సిద్ధరామయ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకు ఇది నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.
జేడీఎస్ నేత - ప్రస్తుత సీఎం కుమారస్వామిని గద్దె దింపేందుకు ఎత్తుగడలు జరుగుతున్నాయని, మాజీ సీఎం కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కేంద్రంగా ఈ స్కెచ్ సాగుతోందని బెంగళూరు మిర్రర్ పత్రిక కథనం వెలువరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సఖ్యత లేకపోవడం, తనకు మరియు తన వర్గానికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న సిద్ధరామయ్యకు బీజేపీ గాలం వేసిందని, సిద్దరామయ్య తనతో పాటు కాంగ్రెస్ పార్టీలోని అసహన నేతలందరితోనూ రాజీనామా చేయిస్తే...ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారం తాము చూసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చినట్లు ఆ కథనం పేర్కొంది. ఓ గుర్తు తెలియని వ్యక్తితో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అసలు ఈ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకునేది అనుమానమే అనే వీడియో గతంలో వెలుగులోకి రావడం, తాజాగా సీఎం మళ్లీ అవుతానంటూ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో...సిద్ధరామయ్య తెరవెనుక ఏదో కసరత్తు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రికి వెన్నుపోటు పొడించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారా? అనే చర్చ కూడా వినివస్తోంది.