రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించటం ప్రభుత్వ కనీస బాధ్యత. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే పోలీసులను ఆశ్రయించి.. తమకు రక్షణ కల్పించాలని కోరితే ఎలా ఉంటుంది? ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోడలు స్మితా రాకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్ర సర్కారుకు ఇబ్బందిని కలిగించేలా ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది.
తమ నివాస పరిసరాల్లో అపరిచితులు తిరుగుతున్నారన్నది సీఎం కోడలి ఫిర్యాదు. ఈ నెల 15న రాత్రి వేళలో తమ ఇంటి వద్ద అపరిచితులు తిరిగినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. అర్థరాత్రి రెండు గంటల వేళలో ప్రహరీ గోడ దగ్గర పెద్ద శబ్ధం చేసినట్లుగా ఆమె ఆరోపించారు. ఈ చప్పుళ్లకు పెంపుడు కుక్క మొరగటంతో నిందితులు పారిపోయినట్లుగా ఆమె చెబుతున్నారు. తనకెదురైన ఇబ్బందిని మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమె.. ఫిర్యాదు చేసింది. స్వయంగా సీఎం కోడలే స్టేషన్ లో సెక్యూరిటీ కల్పించాలంటూ ఫిర్యాదు చేయటంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం కోడలే భద్రత కావాలంటూ కోరుతున్న వేళ.. కర్ణాటకల ముఖ్యమంత్రికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. అయినా సీఎం కోడలికి భద్రత పట్ల అంత భయం కలగటం ఏమిటో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/