రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం కొన్నాళ్లు సాగిన సంగతి తెలిసిందే. తాజాగా అవన్నీ సమిసిపోయి ఇద్దరు చంద్రుళ్లు చెట్టాపట్టాలు వేసుకొంటున్న పరిస్థితి. ఈ ఇరువురి చంద్రుళ్లు కూల్ గా ఉండటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నిశ్చితంగా ఉంటున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. కేసీఆర్ తో ఎలాంటి పంచాయితీ లేని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హటాత్తుగా విమర్శలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వ్యక్తిగత హోదాలో కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించినా.. ఆ భారీతనంలో ‘ముఖ్యమంత్రి’ హోదా స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ.. మీడియా.. రాజకీయ పార్టీలు.. హేతువాదులు సైతం నోరు విప్పని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఈ యాగంతో ఏ మాత్రం సంబంధం లేని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా మాటల తూటాలు పేల్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యాగాలు చేస్తే సరిపోతుందా? అంటూ ప్రశ్నించారు. హోమాలు చేసినంతనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఇందులో శాస్త్రీయత ఉందా? అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. ‘‘యాగాలు చేస్తే వర్షాలు పడతాయా? అదే నిజమైతే దేశంలోకరువు ఛాయలే కనిపించవు కదా? చదువుకున్న వాళ్లు సైతం కొన్ని విషయాల్ని గుడ్డిగా నమ్మటం బాధ కలిగిస్తోంది’’ అంటూ విమర్శలు చేశారు. మరి.. దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు. కేసీఆర్ నోటికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీ అధినేతలు సైతం కంగారు పడుతుంటారు. అలాంటిది సంబంధం లేని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శలు చేయటంపై గులాబీ అధినేత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.