ప్రధానమంత్రి నరేంద్రమోడి నిర్వహిస్తున్న ‘మన్ కి బాత్’ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రేడియో ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి చేరువ అయ్యేందుకు మోడీ ఈ విధానాన్ని ఎంచుకున్నారు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మన్ కీబాత్ తరహాలో ‘దిల్ కి బాత్’కు శ్రీకారం చుట్టారు. ఆకాశవాణి బెంగళూరు కేంద్రం శనివారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫోన్ చేసిన శ్రోతలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సిద్దరామయ్యతో అకాశవాణి ద్వారా సంభాషించిన వారిలో ఎక్కువ మంది తమకు ఇళ్లు లేవని, ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాం పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారని, పోలీసు పోస్టులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విన్నవించారు. వివిధనగరాలు, ప్రాంతాల నుంచి ఫోన్లు చేసిన వారితో సిద్దరామయ్య ఆప్యాయంగా మాట్లాడారు. వారి నుంచి పలు స్థానిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరుతుందా? అని ప్రశ్నించి తెలుసుకున్నారు. చౌకధరల డిపోల ద్వారా అందిస్తున్న గోధుమలు, బియ్యం, నిత్యావసర వస్తువులు చక్కగా అందుతున్నాయా? అని పలువురు శ్రోతల్ని ఆయన అడిగారు. ఆయా పథకాలతో కలుగుతున్న ప్రయోజనంపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. మొత్తం గంటపాటు సిద్ధరామయ్య శ్రోతలతో మాట్లాడారు.
కొసమెరుపుః మొదట ఈ కార్యక్రమానికి ‘దిల్ కీ బాత్’ అని పేరు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ను అనుకరిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చిన నేపథ్యంలో దీన్ని ముఖ్యమంత్రితో ‘ముఖాముఖి’ పేరిట పేరు మార్చారు.