తెలుగు-తమిళంలో టాప్ హీరోగా రాణించిన సిద్ధార్థ్ .. ఇటీవల పూర్తిగా తమిళ పరిశ్రమకే అంకితమైన సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత అజయ్ భూపతి మహాసముద్రంతో తిరిగి తెలుగులో రీఎంట్రీ ఇచ్చినా కానీ అది సత్ఫలితాన్ని ఇవ్వలేదు.
అదంతా అటుంచితే ఇటీవల సిద్ధార్థ్ సోషల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వివాదాల్లోకి వెళుతున్నాడు. ముఖ్యంగా కేంద్రంలోని భాజపాకు అతడు బద్ధ విరోధిగా మారాడు. దీంతో భాజపా నాయకులు అనుచరులు అతడిని అతడి తల్లిని సోషల్ మీడియాల్లో తిట్టడం ప్రారంభించారు. దీనికి ఇప్పుడు సిద్ధార్థ్ కూడా సరైన కౌంటర్ ఇచ్చాడు.
పిటిఫుల్ పిరికిపందలు.. తన తల్లిపై ట్రోల్స్ తో దాడి చేస్తున్నారని సిద్ధార్థ్ అన్నారు. తనపై ద్వేషంతో తన తల్లిని పదే పదే తిట్టిన వ్యక్తులు దేవతలను గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారని మంగళవారం ట్రోలర్లపై మండిపడ్డారు. ట్విటర్ లో సిద్ధార్థ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. ``భంగపరిచే వాస్తవికత. నాపై ద్వేషంతో నా తల్లిని పదే పదే తిట్టిన వ్యక్తులు... సీతా రామయ్య.. దుర్గామాత .. మా సంతోషిని గౌరవిస్తున్నట్లు నటిస్తారు. నా దేశం.. నా మతం.. నా సంస్కృతి... అన్నింటినీ దయనీయంగా స్త్రీలను ద్వేషించే పిరికివాళ్ళ సమూహం ద్వారా హైజాక్ చేయబడింది.. పేద #భారతమాత`` అంటూ వ్యాఖ్యానించాడు.
తన మనసులో ఏం ఉన్నా దానిని బహిరంగంగా మాట్లాడేసే స్వభావం సిద్ధార్థ్ కి ఉంది. తన ఆలోచనలను ధైర్యంగా వినిపించి నిలబడే తత్వం అతడిది. అందుకే ఇప్పుడు భాజపాతోనూ వార్ నడిపిస్తున్నాడు. హిందూ దేవాలయాల నిర్మాణం .. హిందూత్వ పేరుతో తప్పుడు దారిలో ఈ ప్రభుత్వం కొన్నిటిని అనుసరిస్తోందని అతడు నిర్భయంగా చెబుతుంటారు. ఇక తన స్నేహితుడు దేవీశ్రీ ప్రసాద్ విషయంలో కూడా సిదార్థ్ ఇంతకుముందు తీవ్ర ఎమోషన్ తో స్పందించాడు. దేవీశ్రీ తండ్రి గారి మరణం గురించి ప్రస్థావిస్తూ ఆరేళ్లు అయ్యింది. మావయ్య ఎక్కడ ఉన్నా తన గొప్ప కుమారుడిని చూసి గర్విస్తాడు అని ఓదార్చాడు దేవీశ్రీని.
ఇకపోతే సిద్ధార్థ్ తదుపరి భారతీయుడు 2లో ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తూ ఈ సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. శంకర్ ఇప్పుడు కోర్టు తీర్పు మేరకు పూర్తి చేయాల్సి ఉంది. లైకా సంస్థ భారతీయుడు 2ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.