పంజాబ్ లో అధికార పార్టీ కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తులు చల్లారడం లేదు. ఇటవలే ముఖ్యమంత్రిని కూడా మార్చిన కాంగ్రెస్ అధిష్టానం.. దీంతో పార్టీ పరిస్థితులు చక్కబడతాయని భావించింది. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు.. పార్టీ యువ నాయకుడు, మాజీ క్రికెటర్.. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ అధి ష్టానానికి షాక్ ఇచ్చారు. పంజాబ్ పీసీసీ చీఫ్ గా ఉన్న ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్ విషయంలో రాజీపడబోనంటూ లేఖ రాసి పార్టీ అధిష్టానానికి పంపారు. అయితే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
సిద్ధూకు కొంత కాలం క్రితమే పంజాబ్ పీసీసీ పదవిని అధిష్టానం కట్టబెట్టింది. అయితే.. అప్పటి నుంచి ఇ టీవల ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్‌కు సిద్ధూకు మధ్య తీవ్ర వాద ప్రతివాదా లు చోటు చేసుకున్నాయి. తనకు తన వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా చేస్తున్నారని.. సిద్దూ అలగడంతో.. కాంగ్రెస్ ఎట్టకేలకు.. ముఖ్యమంత్రిని మార్చింది. అయితే.. ఇది కూడా సిద్దూను శాంతింపజేయలేకపోవ డం గమనార్హం. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి కారణంగానే రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుంటే.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి.. ఇటీవలే పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీ బాట పట్టారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన కలుసుకునే అవకాశ ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనను రాజీనామా చేయించడం ద్వారా అవమానించిందనే అభిప్రాయంతో కెప్టెన్ ఉండటం, తమ పార్టీలో చేరితే స్వాగతిస్తామంటూ బీజేపీకి చెందిన పలువురు నేతలు వ్యాఖ్యలు చేయడంతో కెప్టెన్ బీజేపీలోకి చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి పంజాబ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కడం గమనార్హం. మరి దీనిని పార్టీ యువ నాయకుడు.. రాహుల్ ఎలా అడ్డుకుంటారో.. సమస్యను పరిష్కరిస్తారో చూడాలి.