ఓటుకు నోటు ఉదంతంలో సుప్రీంకోర్టు నోటీసులు పంపింది కదా అంటే.. ఇలాంటివి ఎన్ని చూడలేదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింఫుల్ గా చెప్పేయటం తెలిసిందే. అయితే.. అన్ని సందర్భాల్లోనూ తేలికగా తీసుకునే అవకాశం ఉండదన్న విషయం బాబుకు ఈదఫా అర్థమవుతుందేమో. ఊహించని రీతిలో బాబుపై వచ్చిన ఓటుకు నోటు అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ.. సరికొత్త ఉద్యమం ఒకటి షురూ అయ్యింది.
అదెలానంటే.. ఏదైనా అంశంపై ఆన్ లైన్లో సంతకాల కార్యక్రమాన్ని షురూ చేసే లో ఇప్పుడు బాబుపై వచ్చిన ఆరోపణలపై నిజాయితీగా.. విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం ఆన్ లైన్లో మొదలైంది. ఓటుకు నోటు కేసులో సంబంధం ఉన్న ధోషులకు చట్టప్రకారం శిక్షించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ కు ఆన్ లైన్ లో పిటీషన్ పంపనున్నారు. change.org
ఇందుకోసం ఏర్పాటు చేసిన పేజీకి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ పేజీని స్టార్ట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే దాదాపు 5వేల మందికి పైనే సంతకాలు చేయటం గమనార్హం. మరో విశేషం ఏమిటంటే.. ఈ దరఖాస్తును సుప్రీంకోర్టు లోని అందరు న్యాయమూర్తులకు పంపనున్నారు. ఓట్లకు నోట్ల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన పిటీషన్ పై సర్వోన్నత న్యాయస్థానం బాబుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులకు తగినవిధంగా శిక్షించాలని కోరుతూ.. ఆన్ లైన్ పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమతో చేతులు కలపాల్సిందిగా ప్రజలు విన్నవించింది. ఊహించని రీతిలో తెరపైకి వచ్చిన ఈ సంతకాల ఉద్యమం బాబుకు సరికొత్త తలనొప్పిగా మారుతుందనటంలో సందేహం లేదు.
వివరాలు కోసం క్లిక్ చెయ్యండి : https://www.change.org/p/honorable-chief-justice-of-india-prosecute-mr-chandrababu-naidu-in-cash-for-vote-case
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/