భూమి మీద కాకుండా అనంత అంతరిక్షంలో మనిషిని పోలిన మనిషి ఉన్నారా? అన్న అంశంపై సాగుతున్న పరిశోధన.. చర్చా ఇంతాఇంతా కాదు. గ్రహాంతరవాసి ఉన్నారా? లేరా? అనే దానికి భారీ చర్చ ఎడతెగని విధంగా సాగుతూనే ఉంది. కచ్ఛితంగా ఉన్నాడనే మాటకు సంబంధించి పలువురు ఇప్పటికే చాలా ఆధారాలు చూపిస్తుంటారు.
ఇన్ని వాదనలు జరుగుతున్నా పక్కా ఆధారాన్ని మాత్రం ఇప్పటివరకూ ఎవరూ చూపించలేకపోయారన్నది వాస్తవం. అయితే.. ఈ సందిగ్థం మరో పదేళ్లలోకచ్ఛితంగా తేలిపోతుందని చెబుతున్నారు నాసా పరిశోధకులు. 2025 నాటికి విశ్వంలో ఉన్న గ్రహాంతరవాసికి సంబంథించిన సమాచారాన్ని పక్కాగా కనుక్కుంటామని.. అతడి జాడలు తెలుసుకోవటం ఖాయమని చెబుతున్నారు.
పదేళ్లలో గ్రహాంతరజీవికి సంబంధించిన సమాచారం తెలుస్తుందని.. అదే 20.. 30 ఏళ్ల నాటికి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు. మంచుతో ఉన్న ఏ ఉపగ్రహమైనా.. అంగారకుడిపై కానీ.. సమీపంలో ఉండే మరో నక్షత్రంలో కానీ జీవం ఉనికి కనుగునే అవకాశం చాలా ఎక్కువగా ఉందంటున్నారు. రాబోయే తరాలకు గ్రహాంతరవాసులతో ఫ్రెండ్‌షిప్ ఖాయమన్న మాట. మరి.. అక్కడెక్కడో ఉన్న గ్రహాంతరవాసికి.. తనలాంటి మనషికి గురించి ఆసక్తి ఎంత ఉందో మరి..?