ప్రాశ్చాత్యులు అని గొప్పగా చూస్తాం కానీ.. కొన్ని సందర్భాల్లో వారు వ్యవహరించే తీరు చూస్తే చాలా విచిత్రంగా ఉండటమే కాదు.. మరీ ఇంత సంకుచితంగా వ్యవహరిస్తారా? అనిపిస్తుంది. తాజాగా ఫ్యారిస్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలను అనుమానంగా చూడటం మొదలైంది. ముస్లింలందరూ ఉగ్రవాదులన్న భావన వారిలో తీవ్రతరం కావటమే కాదు.. సిక్కుల్ని ముస్లింలుగా భావించటం వారిని సందేహంగా చూస్తున్నారు.
నిజానికి ఈ వైఖరి యూరప్ లోనే కాదు.. అప్పట్లో అమెరికా మీద ఉగ్రదాడి జరిగిన సమయంలోనూ.. పలువురు సిక్కుల్ని తీవ్రంగా అవమానించటం.. వారిని ముస్లింలుగా భావించి వేధింపులకు గురి చేయటం లాంటివి జరిగాయి. తాజాగా అలాంటి పరిస్థితే యూరప్ లోనూ నెలకొంది. తాజాగా ఒక సిక్కు జర్నలిస్టులకు ఎదురైన చేదు అనుభవం చూస్తే.. పశ్చిమ దేశాల్లో పైత్యం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. ఎవరో ఆకతాయి చేసిన పనిని.. వెనుకా ముందు చూసుకోకుండా ఒక మీడియా సంస్థ కూడా ప్రచురించటం వివాదంగా మారింది.
కెనడాకు చెందిన వీరేంద్ర జుబ్బల్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సరదాగా తన ఐప్యాడ్ తో అద్దం ముందు నిలుచుని సెల్ఫీ తీసుకున్నాడు. దాన్ని తన సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోటోషాప్ లో తనకున్న ‘కళ’ను ప్రదర్శించి.. ఐప్యాడ్ స్థానంలో పవిత్ర ఖురాన్ గా మార్చేశాడు. అక్కడితో ఆగకుండా.. అతని దుస్తుల మీద పేలుడు పదార్థాలు ఉంచేసి.. అతనో టెర్రరిస్ట్ గా పేర్కొంటూ పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయ్యింది. రాత్రికి రాత్రి ఔత్సాహిక జర్నలిస్ట్ కాస్త.. ఉగ్రవాదిగా మరిపోయాడు. అప్పటివరకూ అతనితో చక్కగా మాట్లాడేవారు సైతం షాక్ తిన్న పరిస్థితి. ఏం జరిగిందో అర్థం కాక తలపట్టుకున్న అతనికి విషయం అర్థమై విస్మయాన్ని వ్యక్తం చేశారు.. ఇదిలా ఉంటే.. ఇతని ఫోటోను ఒక స్పానిష్ పత్రిక ఉగ్రవాది అని పేర్కొంటూ ప్రచురించటంతో అతని పరిస్థితి మరింత దయనీయంగా మారి.. ప్రతిఒక్కరూ అనుమానంగా చూడటం మొదలైంది.
దీంతో తీవ్ర వేదనకు గరైన అ యువకుడు. వెంటనే తన ఒరిజినల్ ఫోటోను పోస్ట్ చేసి అసలు సంగతిని పోస్ట్ చేశాడు. తాను ఉగ్రవాదిని కానని నెత్తినోరు కొట్టుకుంటున్న పరిస్థితి. పేరుకు పాశ్చాత్యులనే కానీ.. తమ దేశంలో జీవించే సిక్కులను చూసి ముస్లింగా భావిస్తూ.. వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న దుస్థితి.