పాక్ పై టీమిండియా చీట్ చేసి గెలిచిందా? దిగ్గజ ఎంపైర్ దిమ్మదిరిగే కౌంటర్
పాకిస్తాన్ పై టీమిండియా విజయాన్ని ఆ దేశ అభిమానులు, ఆటగాళ్లు, మాజీలు తట్టుకోలేకపోతున్నారు. చివరి ఓవర్లో నోబాల్ అక్రమంగా తీసుకొని గెలిచిందంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. విరాట్ కోహ్లీ అడగ్గానే ఎంపై నో బాల్ ఇచ్చాడని.. ఇది సిగ్గుచేటు అని దెప్పిపొడుస్తున్నారు. కోహ్లీ ఒత్తిడి వల్లే నో బాల్ ఇచ్చారని.. ఎంపైర్లు అన్యాయం చేశారని.. డెడ్ బాల్ గా ప్రకటించుకుండా మూడు పరుగులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా ఆడిపోసుకుంటున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక నో బాల్ వివాదంపై రచ్చ చేస్తున్నారు. షోయాబ్ అక్తర్ లాంటి మాజీ ఆటగాళ్లు సైతం అంపైర్ నిర్ణయాన్ని పరోక్షంగా తప్పుపడుతూ సెటైర్లు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా దిగ్గజ అంపైర్ సైమన్ టోఫెల్ పాక్ అభిమానులకు దిమ్మదిరిగేలా వివరణ ఇచ్చారు. ‘భారత్-పాక్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో చోటుచేసుకున్న పరిణామాలపై సైమన్ స్పందించారు. ‘మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా-పాక్ ఉత్కంఠ పోరులో క్లైమాక్స్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యంగా ఫ్రీ హిట్ బంతికి కోహ్లీ బౌల్డ్ అయిన తర్వాత వచ్చిన బైస్ గురించి చాలా మంది నన్ను అడిగారని.. ఈ విషయంలో ఎంపైర్ నిర్ణయం సరైందేనని క్లారిటీ ఇచ్చారు. బాల్ స్టంప్స్ ను తాకిన తర్వాత థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లినప్పుడు బ్యాటర్లు మూడు రన్స్ చేయడం సరైందనేనన్నారు. ఫ్రీ హిట్ సమయంలో బ్యాటర్ బౌల్డ అవ్వడని.. బంతి స్టంప్స్ ను తాకినందు వల్ల డెడ్ బాల్ గా ప్రకటించే వీలు లేదన్నారు. బైస్ నిబంధనల ప్రకారం అంపైర్ ఇచ్చిన నిర్ణయం సరైందేనంటూ ఈ దిగ్గజ అంపైర్ లింక్ డ్ ఇన్ లో రాసుకొచ్చాడు.
ఇక మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ నిబంధనల ప్రకారం.. బ్యాటర్ బ్యాటింగ్ చేసేందుకు సన్నద్ధమై ఉండగా బౌలర్ బంతిని విసిరేందుకు సిద్ధమైన క్రమంలో ఎలాంటి కారణం చేతనైనా వికెట్ మీది బెయిల్ కింద పడినట్లయితే దానిని డెడ్ బాల్ గాపరిగణిస్తారని.. కీపర్ లేదంటే బౌలర్ చేతికి ఫీల్డర్ ద్వారా బంతి అందితేనే అది డెడ్ బాల్ అవుతుందని.. ఆ మధ్యలో బ్యాటర్లు పరుగులు తీసేసుకోవచ్చని వివరణ ఇచ్చారు. బంతి ఫ్రీ హిట్ అయితే ఏ నిబంధనలు వర్తించవన్నారు.
కాబట్టి పాక్ తో మ్యాచ్ సందర్భంగా ఆఖరి ఓవర్లో ఫ్రీహిట్ బంతి కోహ్లీ వికెట్లను తాకినా దినేష్ కార్తీక్ మూడు పరుగులు రాబట్టడం కరెక్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.