ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అమరావతి నిర్మాణం కోసం సమీకరించిన భూమికి లేఅవుట్ రూపొందించే కాంట్రాక్టుపై వెలువడిన వార్త ఒకింత ఆసక్తి, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లే అవుట్ సిద్ధం చేసే బాధ్యతలను సింగపూర్ కు చెందిన జురాంగ్ కంపెనీకి నామినేషన్ పై అప్పగించాలని ఉన్నత స్థాయిలో నిర్ణయించారు. ఇందుకు ఆ కంపెనీకి రూ.14 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరినట్లు గా సమాచారం.
దాదాపు 33 వేల ఎకరాలను అమరావతి కోసం సమీకరించిన ప్రభుత్వం, అయిదేసి వందల ఎకరాలు ఒక్కో భాగంగా విభజించి ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ తయారు చేసేందుకు సిద్ధమయింది. ఇందుకోసం సీఆర్ డీఎ ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను కొంతకాలం క్రితం పిలిచింది. గుజరాత్ కు చెందిన స్టాంపెక్ - హైదరాబాద్ కు చెందిన ఆర్వీ అసోసియేట్స్ ముందుకు వచ్చినప్పటికీ, వారు అర్హత సాధించలేకపోయారు. తర్జనభర్జన తర్వాత జురాంగ్ కు నామినేషన్ పై ఈ పనిని అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ. 14 చెల్లించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అక్టోబరు 15లోగా ఈ పనిని పూర్తి చేయవలసి ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే అప్పటికి సాధ్యమయ్యేటట్టు లేదు. ఒక్కొక్క సెటిల్ మెంట్ లో రోడ్లు - ఓపెన్ స్పేస్ లు - మౌలిక సదుపాయాలకు అవసరమైన స్థలాలను మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు వారి గ్రామాలకు దగ్గరలో వచ్చేలా ప్లాట్లు విభజించాలి. ఈ ప్లాట్ల విభజనలో వాస్తు కూడా పాటించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కొక్క స్కీం లోని వందలాది సర్వే నెంబర్ లకు ఈ ప్లాట్ల విభజనను అనుసంధించాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రక్రియ వేగంగా సాగేందుకు ప్రభుత్వం అన్నిరకాల సహాయం అందించడంతో పాటు...సొమ్ములు కూడా ముట్టజెప్పడం ఆసక్తికరం.