డ్ర‌గ్స్ ఎఫెక్ట్‌.. సింగ‌పూర్‌ లో మ‌నోడికి ఉరి!

Update: 2017-07-14 14:06 GMT
డ‌్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణా కేసులో భార‌త సంత‌తి మ‌లేషియా వ్య‌క్తిని సింగ‌పూర్‌లో ఉరి తీశారు. 29 ఏళ్ల ప్ర‌భాక‌ర‌న్ శ్రీవిజ‌య‌న్‌ ను శుక్ర‌వారం చాంగి ప్రిజ‌న్ కాంప్లెక్స్‌లో ఉరి తీసిన‌ట్లు సెంట్ర‌ల్ నార్కోటిక్స్ బ్యూరో వెల్ల‌డించింది. 2012లో డ్ర‌గ్స్‌తో ప‌ట్టుబ‌డిన ప్ర‌భాక‌ర‌న్‌ కు.. 2014లో మ‌ర‌ణశిక్ష విధించారు. తాజాగా ఈ శిక్ష‌ను అమ‌లు చేశారు.

22.24 గ్రాముల డ‌యామార్ఫైన్‌ తో మ‌లేషియా నుంచి సింగ‌పూర్‌ లోకి రావ‌డానికి ప్ర‌య‌త్నించిన ప్ర‌భాక‌ర‌న్‌ ను 2012లో ప‌ట్టుకున్నారు. అత‌నిపై మ‌లేషియా కోర్టులోనూ విచార‌ణ జ‌రుగుతున్న కార‌ణంగా మ‌ర‌ణశిక్ష అమ‌లును వాయిదా వేయాల‌ని ప్ర‌భాక‌ర‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది చూ జెంగ్ జీ కోర్టును కోరినా.. ముగ్గురు జ‌డ్జీల ధ‌ర్మాస‌నం ఆయ‌న విన‌తిని తోసిపుచ్చింది. ప‌క్క దేశాల కోర్టుల‌తో సంబంధం లేదని, ప్ర‌తి దేశం త‌న రాజ్యాంగం, చ‌ట్టాల ప్ర‌కార‌మే ప‌ని చేస్తుంద‌ని స్ప‌ష్టంచేశారు. అయితే విచార‌ణ తీరుపై ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ సందేహాలు వ్య‌క్తంచేసింది. ప్ర‌భాక‌ర‌న్ క్ష‌మాభిక్ష కోరినా.. అది కూడా విజ‌య‌వంతం కాలేదు. బ్రిటిష్ హ‌యాం నుంచే సింగ‌పూర్‌ - మ‌లేషియాల‌లో డ్రగ్స్ అక్ర‌మ ర‌వాణా చేసేవాళ్ల‌ను ఉరి తీస్తున్నారు.

కొస‌మెరుపు- హైద‌రాబాదులో మాత్రం నెల‌కు నాలుగు ఐదు మంది డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ చేస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డుతుంటారు. కానీ, ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ యావ‌జ్జీవ శిక్ష‌ను కూడా అనుభ‌వించిన‌ట్లు ఏ రోజూ వార్త‌లు రాలేదు. చ‌ట్టాల అమ‌లు ఇలా ఉంటే... డ్ర‌గ్స్ అదుపు ఎలా సాధ్య‌మ‌వుతుంద‌న్నది సామాన్యుల ప్ర‌శ్న‌. స్కూళ్లు దాకా డ్ర‌గ్స్ చేరాయంటే ఎలా త‌రాన్ని మ‌నం త‌యారుచేస్తున్నామో అంద‌రూ ఆలోచించాల్సిన స‌మయం ఇది.
Tags:    

Similar News