ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేసి, అందరూ చూస్తుండగా.. ఆత్మహత్యాయత్నం చేశాడో సింగర్. ఈ ఘటన మహారాష్ట్రలోని శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగ్ పూర్ కు చెందిన ఓ గాయకుడు పాటలు పాడుతూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో అతని ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుటుంబాన్ని సాకలేక ఎన్నో అవస్థలు పడ్డాడు.
ఈ క్రమంలో.. ఎన్నోసార్లు మానసిక వేదనకు గురైన 35 సంవత్సరాల సింగర్.. శనివారం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి, తన ఆవేదన మొత్తం చెప్పుకున్నాడు. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న కత్తితో చేతి మణికట్టును కోసుకున్నాడు.
కాపాడాలంటూ భార్యాపిల్లలు కేకలు వేశారు. ఇంటి చుట్టుపక్కల వారితోపాటు ఈ లైవ్ చూసిన మిత్రులు హుటాహుటిన పరిగెత్తుకొచ్చారు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి నెత్తురోడుతున్న మిత్రున్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోట్లాది కుటుంబాలను దెబ్బతీసింది. లక్షలాది ప్రాణాలను బలిగొంది. మన దేశంలోనూ ఎంతో మంది కరోనా తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా.. మరోసింగర్ ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు.