మరికొన్ని రోజుల్లోనే కొత్త సంవత్సరం.. యువత, పెద్దలు అంతా దాన్ని ఆహ్వానించడానికి రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికే డిసెంబర్ 31న రాత్రి పార్టీలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక మెట్రో పాలిటన్ సిటీ హైదరాబాద్ లో ఎంత జోష్ ఉంటుందో చెప్పక్కర్లేదు.
మద్యం తాగి, యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువే. ఈ నేపథ్యం లోనే తెలంగాణ పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. 2020 సంవత్సర వేడుకల్లో రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు, అపశ్రుతులకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. ఈ మేరకు ఈవెంట్ ఆర్గనైజర్లు, హోటల్స్, పబ్ నిర్వాహకులతో తాజాగా సమావేశం నిర్వహించారు. మహిళలకు పటిష్ట భద్రత, రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడమే లక్ష్యంగా నిబంధనలు విడుదల చేశారు.
అమ్మాయిలను ఏడిపించడం.. రచ్చ చేయడం.. గొడవలకు దిగితే జైలుకు పంపిస్తామని పోలీసు కమిషనర్లు హెచ్చరించారు. డిసెంబర్ 31న తాగి దొరికితే ఏకంగా 10వేల ఫైన్ వేస్తామన్నారు. వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. హైదరాబాద్ పరిధిలో పలు నిబంధనలు రూపొందించారు.
*డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో పాటించాల్సిన నిబంధనలు:
* అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉన్నా, వస్తువులు కనపడినా వెంటనే డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నం. 949-061-7111, సైబరాబాద్ వాట్సాప్ నం. 949-061-7444 కు సమాచారం అందించాలి.
* సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కు సంబంధించిన సమస్యలు ఎదురైతే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నం. 850-041-1111 కు సమాచారం ఇవ్వాలి.
* నూతన సంవత్సర వేడుకుల ను రాత్రి 8 నుంచి 1 గంట వరకే నిర్వహించాలి.
* వేడుకల నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోవాలి.
* డీజేకు అనుమతి లేదు, 45 డెసిబెల్స్ మ్యూజిక్ శబ్దం మించకూడదు.
* మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. వేడుకల్లో అశ్లీలం ఉండవద్దు.
* డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా, వాహనం సీజ్.
* వేడుకల సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే పానీయాలు తాగొద్దు.
* మహిళలు, పిల్లలను నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే వేడుకలకు పంపొద్దు.
* క్యాబ్, ఆటో డ్రైవర్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే డయల్ 100, లేదా హాక్ ఐ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.