రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి మృతిపై స్పష్టత వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆయనది ఆత్మహత్యగా అధికారులు భావించినా.. ఆయన కుటుంబీకులు మాత్రం హత్యగా చెప్పటం.. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఆయన మృతి చోటు చేసుకుందన్న ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఆ వాదనలో ఎలాంటి నిజం లేదని.. ప్రభాకర్ రెడ్డి మరణం కచ్ఛితంగా ఆత్మహత్యేనని.. అందుకు శిరీష వ్యవహారమే కారణంగా భావిస్తున్నట్లుగా పోలీసు బాసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఒక నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కుకునూర్ పల్లి ఎస్ ఐ మృతి వెనుక అసలు విషయాన్ని తేల్చాల్సిందిగా డీజీపీ అనురాగ్ శర్మ.. అదనపు డీజీపీ గోపీకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి డీఎస్పీ తిరపతన్నతో కలిసి గోపీకృష్ణ రంగంలోకి దిగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ - ఎస్ ఐ క్వార్టర్ లను పరిశీలించడంతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది, శిరీష ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన రాజీవ్.. శ్రవణ్ లను విచారించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మరణం వెనుక ఉన్నతాధికారుల వేధింపులు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ జరిపారు. అయితే.. వేధింపుల కారణంగానే ఎస్ ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఎక్కడా ఆధారాలు లభించలేదని నివేదిక చెబుతున్నట్లుగా తెలుస్తోంది. శిరీష ఇష్యూలో విషయాలు బయటకు వస్తే సమాజంలో తన పరువు పోతుందన్న భయంతోనే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
పరువు పోతుందన్న భయం.. మానసిక ఒత్తిడి.. క్షణికావేశంలోనే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న అభిప్రాయాన్ని పోలీసులు నివేదికలో వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. సెటిల్ మెంట్ కోసం ఫ్రెండ్స్ తో వచ్చిన బ్యూటీషియన్ శిరీషను ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నం చేయబోయినట్లుగా ఇప్పటికే సమాచారం బయటకు రావటం.. ఈ అవమానంతోనే శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆధారాలు లభిస్తున్న వేళ.. అత్యాచార యత్నానికి పాల్పడిన సమాచారం బయటకు వస్తే సమాజంలో పరువు పోతుందన్న భయంతోనే ఎస్ ఐ తన రివాల్వర్ తో కాల్చుకొని మరణించినట్లుగా భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/