ప్రపంచానికి శాంతిని అందించి.. ప్రపంచం అంతా దయతో.. ప్రేమతో వ్యవహరించాలన్న తత్వాన్ని బోధించిన మదర్‌థెరిస్సా శిష్యురాలు సిస్టర్ నిర్మల అనంత లోకాలకు పయనమయ్యారు. 81 సంవత్సరాల వయసున్న ఆమె.. 1997లో మదర్ థెరిస్సా మరణించిన తర్వాత ఆమె మిషనరీస్ ఆఫ్ చారటీ బాధ్యతల్ని స్వీకరించారు.
1934 జూలై 23న రాంచీలో జన్మించిన ఆమె.. నేపాల్ నుంచి వలస వచ్చిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. పదిహేడేళ్ల వయసులో నిర్మల సన్యాసం తీసుకున్నారు. 2009లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందిన ఆమె.. ఇక లేరన్న వార్త పలువురు శాంతికాములకు షాకింగ్ న్యూస్‌గా మారింది. ఆమె మృతి పట్ల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సంతాపాన్ని తెలిపారు. సేవతో ప్రేమను పంచాలనుకునే మరో శాంతిమూర్తి ఆస్తమించటం అందరిని కలతకు గురి చేసే అంశం.