హైదరాబాద్ ను ముఖ్యంగా టాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసు అటక ఎక్కిందనే అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలోనే మరో ట్విస్ట్ ఎదురైంది. డ్రగ్స్ ను ప్రతిష్టాత్మకంగా విచారిస్తున్న సిట్ దృష్టి ఐటీ రంగం వైపు మళ్ళింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ కు నెదర్లాండ్ నుంచి డ్రగ్స్ దిగుమతి చేస్తున్న మైక్ కమింగో విచారణను ప్రారంభించిన సిట్‌కు అనేక ఆసక్తికరమైన అంశాలు తెలిసినట్లు సమాచారం. నెదర్లాండ్ కు చెందిన కమింగో గత కొన్నేళ్ళుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడని, స్థానిక యువతిని వివాహం చేసుకున్నాడని గుర్తించారు.
ఐటీ నిపుణుడైన కమింగోకు నగరంలో పేరొందిన పలు ఐటీ కంపెనీలకు చెందిన వారితో పరిచయాలున్నాయన్న విషయాన్ని నిర్ధారించుకున్నప్పటికీ ఆ పరిచయం ఐటీ సహాయం కోసమేనా? లేక డ్రగ్స్‌తో ఏమైన లింక్ లున్నాయా అన్న విషయాన్ని తేల్చాల్సి ఉందని సమాచారం. కమింగో పలు సాఫ్ట్ వేర్ సంస్థలకు కన్సల్టెంట్ గా ఉన్నాడని, ఆయా సంస్థలకు కావాల్సిన సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేసి ఇచ్చేవాడని కూడా గుర్తించారు. పలు ఐటీ సంస్థలకు చెందిన కీలక వ్యక్తులతో పాటు ఆయా సంస్థలలో పని చేసే ఎంతో మందికి కమింగో డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో సిట్ గుర్తించింది. కమింగో నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ లు - ల్యాప్ టాప్ లలో ఐటి రంగంలోని పలువురి వివరాలున్నాయని, కొందరితో జరిపిన చాటింగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు విచారణ మొదటి రోజు అధికారులు చేసిన ప్రయత్నాలకు కమింగో సహాయ నిరాకరణ చేసినట్లు సమాచారం. ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తమైన సమాచారాన్ని సేకరించేందుకు పాస్ వర్డ్ అడ్డం వస్తుందని, పాస్ వర్డ్‌ను చెప్పేందుకు కమింగో నిరాకరిస్తున్నట్లు అధికారులంటున్నారు. ఫోన్ లో దాదాపు 1500 మందికి చెందిన ఫోన్ నంబర్లున్నాయని, వీటిల్లో ఎంత మంది తరచూ కమింగోతో మాట్లాడారన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందని అంటున్నారు.
కాగా, ఖచ్చితంగా కమింగో కొంత మంది ఐటి నిపుణులకు డ్రగ్స్ ను సరఫరా చేసినట్లు గుర్తించామని, ఇందుకు మరికొన్ని ఆధారాల కోసం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆధారాలు తేలితే ఐటీ రంగంలోని వారిని కూడా విచారించేందుకు సిద్దమని అధికారులు పేర్కొంటున్నారు. కమింగోను తరచూ ఎవరు కలిసేవారు, అతడు హైదరాబాద్ కు ఎలా పరిచయమయ్యాడనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నాలలో అధికారులున్నారు. కెల్విన్ తరచూ గోవాకు వెళ్ళాడని, అదే సమయంలో కమింగో కూడా వెళ్ళినట్లు ప్రాథమిక ఆధారాలను అధికారులు సేకరించారు. అయితే వీరిద్దరూ గోవాలో ఎవరిని కలిసే వారన్న విషయంపై దృష్టి కేంద్రీకరించారు.
మరోవైపు కమింగో కొన్ని క్లబ్ లలో పార్టీలను కూడా నిర్వహించాడని, ఈ పార్టీలకు కెల్విన్ కూడా వచ్చాడని తేలింది. అయితే పబ్ లలో జరిగిన పార్టీలకు వచ్చిన వారెవరనే విషయాన్ని కూడా తేల్చే పనిలో అధికారులున్నారు. ఏయే పబ్‌లలో కమింగో పార్టీలను నిర్వహించాడనే విషయాన్ని కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా కమింగో వెల్లడించే అంశాల ఆధారంగా ఐటీ రంగంలోని వారిని కూడా విచారించేందుకు సిట్ సన్నద్దమవుతుందన్న విషయం స్పష్టమైంది.