డ్రగ్స్ విచారణ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. గడిచిన కొద్ది రోజులుగా అన్ని ఇష్యూలు పక్కకు వెళ్లిపోయి.. డ్రగ్స్ విచారణే ప్రముఖంగా మారిన పరిస్థితి. పలువురు సినీ ప్రముఖుల్ని విచారించిన అధికారులకు కొన్ని అంశాలకు సంబంధించి పక్కా ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా ఇద్దరు సినీ ప్రముఖులైతే అడ్డంగా దొరికిపోయినట్లుగా చెబుతున్నారు. వారిద్దరూ డ్రగ్స్‌కు బాధితులే కాదు.. నేరస్తులు కూడా అన్న విషయాన్ని ఫ్రూవ్ చేసే సాక్ష్యాల్ని సిట్ సేకరించినట్లుగా చెబుతున్నారు. ఇద్దరిలో ఒకరైతే డ్రగ్స్‌ను సేకరించటమే కాదు.. ఇతరులకు అందించిన అంశానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎన్ డీపీఎస్ 1985 చట్టం ప్రకారం వారిపై కేసులు పెట్టేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోన్నట్లుగా చెబుతున్నారు.
డ్రగ్స్ కేసులో కెల్విన్ ను మొదట ఆ తర్వాత జీషన్ అలీలను ఆబ్కారీ శాఖ అరెస్ట్ చేయటం తెలిసిందే. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. వారిలో పలువురిని ఇప్పటికే విచారించిన వైనం విదితమే.
విచారణలో భాగంగా పలు అంశాలపై దృష్టి పెట్టిన అధికారులకు.. ఇద్దరు ప్రముఖుల విషయంలో వారు డ్రగ్స్ కు సంబంధించి ఆరు పక్కా సాక్ష్యాలు సేకరించినట్లుగా సమాచారం బయటకు వస్తున్న వైనం సంచలనంగా మారుతోంది.
విచారణలో భాగంగా నలుగురు సినీ ప్రముఖులు తాము గతంలో డ్రగ్స్ వాడామని.. ఇప్పుడు మానేశామని చెప్పగా.. మిగిలిన వారు తమకు ఆ అలవాటే లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఒక ప్రముఖుడి విషయంలో మాత్రం తన అవసరాల కోసం తెప్పించుకున్న డ్రగ్స్‌ను.. తర్వాత తానే సహచరులకు అందించినట్లుగా అభియోగాలు ఉన్నాయి. అయితే.. ఈ విషయం నిజమని తేలినట్లుగా చెబుతున్నారు.
విచారణలో పాల్గొన్న నలుగురు ఆ అభియోగాలను అవునని చెప్పినట్లుగా తెలుస్తోంది. సదరు ప్రముఖుడు డ్రగ్స్‌ను తెప్పించుకోవటం చూశామని.. వినియోగించటం తాము చూసినట్లుగా చెప్పినట్లుగా సమాచారం. షూటింగ్ టైంలోనే కాదు.. రిలాక్స్ అయ్యే వేళలోనూ ఆయన వీటిని వినియోగించినట్లుగా పక్కా సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు డ్రగ్స్ వాడటం తప్పనిసరి అంటూ చెప్పినట్లుగా పలువురు పేర్కొన్నట్లుగా సమాచారం. సిట్ విచారణలో నలుగురు ఇదే విషయాన్ని సాక్ష్యంగా చెప్పినట్లుగా చెబుతున్నారు.
డ్రగ్స్ తో ఆయన సంపాదించాల్సిన అవసరం లేదు కానీ.. విదేశాల్లో ఉన్న వేళలో డ్రగ్స్ ఎక్కువగా వినియోగించేవాడని.. తను కొంత ఉంచుకొని మిగిలినది మరికొందరికి ఇచ్చే వారంటూ విచారణ వేళ ఓ ప్రముఖుడు వెల్లడించాడని.. ఇది కీలక సాక్ష్యంగా మారనున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో మరో నటుడు ఇచ్చిన వాంగ్మూలం కూడా కీలక సాక్ష్యంగా మారనున్నట్లుగా చెబుతున్నారు.
ఒక సినిమా షూటింగ్ లో భాగంగా సదరు ప్రముఖుడు.. సాక్ష్యం చెప్పిన నటుడు.. విచారణలో పాల్గొన్న మరో హీరో కలిసి బ్యాంకాక్ లో చాలా రోజులు ఉన్నారని.. ఆ సందర్భంగా తానే స్వయంగా డ్రగ్స్ తెచ్చి ఇచ్చానని అంగీకరించినట్లుగా చెబుతున్నారు. అక్కడి పబ్ లు.. బీచ్ పార్టీలకు వెళ్లే వాళ్లమని కూడా అంగీకరించినట్లుగా సమాచారం. సదరు ప్రముఖుడిపై నటనతో సంబంధం లేని వ్యక్తి కూడా డ్రగ్స్ వినియోగించే విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సదరు ప్రముఖుడిపై కేసు కట్టటం పక్కా అని తేల్చి చెబుతున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో మరో జూనియర్ నటుడు కూడా కేసు ఎదుర్కొనక తప్పదని తెలుస్తోంది. డ్రగ్స్ ను వాడటమే కాదు.. డబ్బులకు పలు పబ్ లకు అందించినట్లుగా పక్కా సాక్ష్యాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇద్దరు సినీ ప్రముఖులకు డ్రగ్స్ కేసు చుట్టుకోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. కేసు కట్టే ముందు మరింత కసరత్తు చేయాలని.. ఏ చిన్న పొరపాటు దొర్లకుండా చూసుకోవాలన్న ఆదేశాలు ఉన్నతాధికారుల నుంచి వస్తున్నాయని.. దీంతో.. అన్ని వైపుల నుంచి జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. తాము మోపే అభియోగాలు తేలిపోకుండా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామం చూస్తుంటే డ్రగ్స్ విచారణ సంచలనం ఇప్పటితో ముగిసిపోయేటట్లుగా లేదన్న మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు ఖాయమన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.