రేవంత్ రెడ్డిపై చర్యలకు సిట్ రెడీ

Update: 2023-03-23 17:52 GMT
టీఎస్.పీఎస్సీ కుంభకోణంపై సంచలన ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసి ఈరోజు విచారించింది. గురువారం సిట్ ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి ఈ మేరకు తనకు తెలిసిన విషయాలను సిట్ ముందు పంచుకున్నాడు. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్ బృందం పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఆధారాలు సమర్పించకుండా నిరాధారమైన ఆరోపణలు చేసిన రేవంత్ పై చర్యలు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు న్యాయపరమైన సలహాలు తీసుకొని రేవంత్ పై చర్యలు తీసుకునేందుకు సిట్ రెడీ అవుతోంది.

ఇటీవల రేవంత్ రెడ్డి ‘టీఎస్.పీఎస్సీ’ కుంభకోణం విషయంలో పలు సంచలన ఆరోపణలు చేసింది. ఒకే మండలంలో 100 మంది పాస్ అయినట్టుగా రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈరోజు  విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్ కు సమర్పించారు. రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ రికార్డు చేసింది.

సిట్ విచారణ అనంతరం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ సమస్యలను దృష్టిలో పెట్టుకొని సిట్ విచారణకు హాజరయ్యానని తెలిపారు. ఆరోపిస్తున్న వారందరికీ సిట్ నోటీసులు జారీ చేస్తోందని.. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. కేటీఆర్ వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని చెప్పారని.. ఆయనకు నోటీసులు జారీ చేయండని సిట్ ను కోరినట్టు రేవంత్ తెలిపారు.కేటీఆర్ నుంచి సిట్ అధికారులు ఎందుకు సమాచారాన్ని సేకరించడం లేదని రేవంత్ నిలదీశారు.

ఇక టీఎస్.పీఎస్సీ కుంభకోణంపై ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా సిట్ నోటీసులు పంపింది. ఆయన కూడా విచారణకు హాజరవుతారా? లేదా చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News