ప్రధాని మోడీ అండ్ కో మీద ఏ చిన్న అవకాశం వచ్చినా చెలరేగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు కమ్యూనిస్టులు. గడిచిన రెండున్నరేళ్లుగా తమ నోటికి.. చేతికి అవకాశం ఇవ్వకుండా పాలిస్తున్న మోడీపై ఫైర్ అయ్యేందుకు తగిన అవకాశం కోసం చూస్తున్న కమ్యూనిస్టు నేతలకు తాజాగా పెద్దనోట్ల రద్దు ఎపిసోడ్ వారికి ఒక అవకాశంగా మారిందన్న మాట వినిపిస్తోంది.
పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి స్పందన లేకుండా ఉండిపోయి కమ్యూనిస్టు నేతలు.. గడిచిన రెండు.. మూడు రోజులుగా బ్యాంకుల వద్దా.. ఏటీఎం కౌంటర్ల వద్ద ప్రజలు చిల్లర కోసం పడుతున్న ఇబ్బందులతో అలెర్ట్ అయ్యారు. దీనికి తోడు.. కమ్యూనిస్టుల పొడ కూడా గిట్టని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం కమ్యూనిస్టులకు ఫోన్ చేసి మోడీపై ఫైటింగ్ కలిసి చేద్దామని ఆఫర్ ఇవ్వటంతో కమ్యూనిస్టు నేతల్లోకొత్త ఉత్సాహ పొంగిపొర్లుతోంది.
మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటంత ద్వారా.. తృతీయ కూటమిని ఏర్పాటు చేసి కేంద్రాన్న ఏలాలన్న కోరిక కమ్యూనిస్టులకు ఎప్పటి నుంచో ఉందన్న విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో మాత్రం సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాంఏచూరి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దగ్గర నల్లకుబేరులకు సంబంధించిన జాబితా ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోని నల్లధనంలో 90 శాతం విదేశాల్లోనే ఉందని చెప్పిన ఆయన.. విదేశాల్లో ఎవరి దగ్గర ఎంతెంత బ్లాక్ మనీ ఉందన్న విషయం ప్రధాని మోడీ దగ్గర ఉందన్నారు.
పెద్దనోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని తీసుకురావటం ప్రజలు ఏ మాత్రం ఇష్టపడటం లేదని.. కొత్త కరెన్సీని ప్రవేశ పెట్టటంతో లాభం ఏమిటో చెప్పాలంటున్నారు. ఉగ్రవాదులకు నిధులు తరలించే వారుక్యారీ బ్యాగుల్లో తరలించరని.. ఆన్ లైన్లో చెల్లింపులు చేస్తుంటారని చెప్పిన ఆయన.. కేంద్రం ప్రజల ఇబ్బందుల్నిదృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ మోడీ దగ్గర నల్ల కుబేరుల జాబితా ఉన్నట్లు సీతారం ఏచూరికి ఏలా తెలిసిందే చెబితే బాగుంటుందేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/