జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ కు చాలా పాపులారిటీ దక్కింది. ఇపుడు ఆయన రాజకీయాల్లోకి రావచ్చు. అయితే ఆయన్ను అభిమానించే పార్టీకి పట్టుమని పదిస్థానాలు కూడా లేవు- కన్నయ్యకుమార్ బెయిల్ పై విడుదలైన అనంతరం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆయనపై చేసిన కామెంట్. వెంకయ్య యథాలాపంగా అన్నారో లేకపోతే సీరియస్ గానో అన్నారో తెలియదు కానీ ఇపుడు అదే నిజం అయింది
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల ప్రచారకర్తగా కన్నయ్య కుమార్ వ్యవహరిస్తారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..వచ్చే నెలలో కేరళ - పశ్చిమ బెంగాల్ - తమిళనాడు - అస్సాం - పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో కన్నయ్య వాక్చాతుర్య నైపుణ్యాన్ని వినియోగించుకుంటామని చెప్పారు.
జేఎన్ యూలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై దేశ ద్రోహం కేసులో కన్నయ్యకుమార్ ఇటీవల అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైన విషయం విదితమే. ఈ ఎపిసోడ్ లో కన్నయ్యకు లెఫ్ట్ పార్టీలు ముఖ్యంగా సీపీఎం మద్దతిచ్చింది. ఇదిలా ఉండగా సీతారాం ఏచూరీ సైతం జేఎన్ యూ పూర్వవిద్యార్థికావడం ఆసక్తికరం. మొత్తంగా వెంకయ్య మాటవరుసకు కామెంట్ చేస్తే..కమ్యూనిస్టులు దాన్ని అందిపుచ్చుకొని ప్రచారానికి ఉపయోగించుకున్నారని టాక్ నడుస్తోంది.