ఎరక్కపోయి ఆ దేశంలో చదువుకున్నారు. వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్ అయిపోదామని కలలుగన్నారు. కానీ సడెన్ గా వచ్చినపడిన 'యుద్ధం' వారి ఆశలను చిదిమేసింది. ఉక్రెయిన్ లో చదివుతున్న భారత వైద్య విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. ఉక్రెయిన్ నుంచి భారత్ కు తిరిగివచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్ ఇప్పుడు అయోమయంలో పడింది.
ఉక్రెయిన్ లో భారత దేశానికి చెందిన 18వేల మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు.యుద్ధం కారణంగా అకస్మాత్తుగా ఈ 18వేల మంది విద్యార్థులంతా దేశానికి తిరిగి వచ్చేశారు. ఇందులో 1000 మంది వరకూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులున్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే అక్కడ యుద్ధం ఆగేటట్టు కనిపించడం లేదు. యుద్ధం ఆగినా యుక్రెయిన్ లో మళ్లీ పూర్వపు పరిస్థితులు రావాలంటే దశాబ్దకాలం పడుతుంది. రష్యా సైన్యం దాడులతో ఇప్పుడు ఉక్రెయిన్ లో శశ్మాన వాతావరణం నెలకొంది. అన్ని నగరాలు ధ్వంసమైపోయాయి. నగరాలు నేలమట్టమైపోయాయి.
ఇక కాలేజీలు, ఆఫీసులు , ఇతర భవనాలు పునర్నిర్మించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరూ చెప్పలేరు.కాబట్టి విదేశీ విద్యార్థులు ఇక ఉక్రెయిన్ కు వెళ్లి చదువుకునే అవకాశం ఇప్పట్లో లేదు.
ఇక షాకింగ్ విషయం ఏంటంటే.. యుద్ధానికి ముందే చాలా మంది మెడిసిన్ పూర్తయ్యింది. మరో మూడు నెలల్లో మెడిసిన్ డిగ్రీ పట్టా అందుకోబోతున్నారు. చివరి మూడు నెలల్లో డిగ్రీ చేతికొచ్చేస్తుందనగా యుద్ధం మొదలైంది. దీంతో చివరి పరీక్షలు రాసి డిగ్రీలు తెచ్చుకోవాలంటే మరికొన్ని సంవత్సరాలు ఎదురుచూడాల్సిందే.
అందుకే తమ ఆగిపోయిన చదువును భారత్ లోని వైద్య కళాశాల్లో మెడిసిన్ కంటిన్యూ అయ్యేలాగా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టులో వారంతా కేసులు వేశారు. విద్యార్థుల కోరిక చిన్నదే అయినా ఇది అమలు చేయడం చాలా అసాధ్యం. వేల మందికి పట్టాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. వాళ్ల వైద్య విద్య పరిజ్ఞానం తెలుసుకోకుండా ఉక్రెయిన్ బాధితులంటూ మెడిసిన్ డిగ్రీ ఇవ్వడం దేశంలో కుదరదు.
భారత్ లో మెడిసిన్ పరీక్ష రాస్తే సీటు రాకపోవడంతోనే వీరంతా ఉక్రెయిన్ వెళ్లి డబ్బులు కట్టి చదువుతున్నారు. వీరిని ప్రైమేటు కాలేజీల్లో కూడా సర్దుబాటు చేయలేని పరిస్థితి. దీంతో కోర్టు విచారణ ఏ విధంగా చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది.