బాబు చెప్పిందే భారతమైనా, రామాయణమైనా!

Update: 2017-04-05 06:11 GMT
సినీ న‌టుడిగా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకొని ఉద్య‌మ‌బాటలో ప‌య‌నించే సెల‌బ్రిటీలు చాలా అరుదు. అలాంటి కోవ‌కు చెందుతారు టాలీవుడ్ హీరో శివాజీ. త‌న‌కున్న సెల‌బ్రిటీ స్టేట‌స్‌ను వ‌దిలేసి మ‌రీ.. ప‌లు అంశాల మీద ఉద్య‌మ‌బాట ప‌ట్టిన ఆయ‌న‌.. ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని మ‌రింత ప‌ట్టుద‌ల‌గా తీసుకోవ‌టం తెలిసిందే. హోదా విష‌యంలో ఏపీ అధికార‌ప‌క్షంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ఏకైక సినీ సెల‌బ్రిటీగా ఆయ‌న్ను చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంతో పోలిస్తే.. ఈ మ‌ధ్య‌న ప్ర‌త్యేక హోదా మీద విమ‌ర్శ‌ల్ని త‌గ్గించిన శివాజీ.. అప్పుడ‌ప్ప‌డు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

గ‌తంలో హోదా విష‌యం మీద బోలెడ‌న్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అండ్ కోల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మొత్తానికి ఏమైందో ఏమో కానీ.. విమ‌ర్శ‌ల మోతాదును త‌గ్గించారు. తాజాగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఆయ‌న‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌టానికి కార‌ణం.. ఓటుకు నోటు కేసు అని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉండ‌టం వ‌ల్లే హోదా రావ‌ట్లేద‌న్న ఆయ‌న‌.. ప్ర‌త్యేక హోదా రాదని సీఎం స్వ‌యంగా అంటున్న నేప‌థ్యంలో ఇక దాని గురించి మాట్లాడ‌టానికి ఏం ఉంటుందంటూ నిరాశ‌ను వ్య‌క్తం చేశారు.

శ్రీవారి సాక్షిగా ఏపీకి 15 ఏళ్లు ప్ర‌త్యేక హోదా కావాల‌ని ఇప్ప‌టి ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు అన్నార‌ని.. కానీ ఇప్పుడు ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడే ప‌రిస్థితి లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏం చెబితే అదే రామాయ‌ణం.. అదే మ‌హాభార‌త‌మంటూ వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు చేసిన శివాజీ.. త‌న ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ గురించి మాత్రం వెల్ల‌డించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News