ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటూ మొదటి నుంచి గళం వినిపిస్తూ.. పెద్ద ఎత్తున తిరిగిన ఒకే ఒక్క టాలీవుడ్ హీరో శివాజీగా చెప్పాలి. ఆయనకున్న ఇమేజ్ పరిమితం కావటంతో ఆయన ఎంత ప్రయత్నించినా.. ప్రత్యేక హోదా మీద ఆయన పెద్దగా ప్రభావితం చేయలేదని చెప్పాలి. కాకపోతే.. ప్రత్యేక హోదా కారణంగా ఏపీకి కలిగే ప్రయోజనాల తోపాటు.. ఏపీ అధికారపక్షం చెప్పే అడ్డగోలు మాటలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటమే కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబును మాటలతో కడిగేసే తీరులో శివాజీ మాట్లాడతారని చెప్పాలి.
తాజాగా ఒక వీడియోను విడుదల చేసిన శివాజీ.. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ఆంధ్రా యువతను అడ్డుకునేలా వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును.. ఆయన ప్రభుత్వంపై పలు సూటి ప్రశ్నల్ని సంధించారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని అనుకుంటున్న యువతను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన శివాజీ.. ఫ్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని.. దాన్ని సాధించుకునేందుకు అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రులకు ఎంతో అవసరమైన హోదా మీద రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయదని.. అదే సమయంలో పోరాటం చేసే వారినిఅడ్డుకుంటుందని మండిపడ్డ శివాజీ.. ‘‘ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోందంటే.. అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు. రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయదు. చేసేవాళ్లను అడ్డుకుంటుంది. ఏమిటండీ ఇది? అసలు చంద్రబాబు.. ఆయన మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లుగా ఎందుకు ఫీవుతున్నారో అర్థం కావటం లేదు. ఇది ఆయన మీద పోరాటం కాదు. భావితరాల జీవన్మరణ సమస్య. ప్రత్యేక హోదా అన్నది ఏపీలోని ప్రతి బిడ్డ హక్కు’’ అని వ్యాఖ్యానించారు.
ప్రజలు తమ హక్కుల సాధన కోసం నిరసన తెలియజేయటానికి బీచ్ కి వస్తే తప్పేమిటని ప్రశ్నించిన శివాజీ.. బాబుకు గతాన్ని గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో ఆయన తీరుకారణంగా ఆయన రైతు వ్యతిరేకిగా.. ఉద్యోగి వ్యతిరేకిగా అనేక ముద్రలు వేయించుకున్నారని.. యువతను నిరసన తెలపటానికి అడ్డుకొని యూత్ వ్యతిరేకి అన్న ముద్రను వేసుకోవద్దని కోరారు.‘‘ఇలాంటి ముద్ర మీకు ఏమాత్రం మంచిది కాదు. నిజానికి ఇలాంటి దీక్ష చేస్తున్నప్పుడు.. శాంతియుతంగా చేసే నిరసనల్లో సంఘ విద్రోహ శక్తులు చేరే అవకాశం ఉందని జాగ్రత్తలు చెప్పి.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సింది పోయి.. అనుమతి ఇవ్వకుండా ఉండటం ఏమిటి?’అని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా అంశం ఎప్పుడో తేలాల్సిన అంశమని.. కానీ.. చంద్రబాబు.. వెంకయ్యలు నీరుకార్చాలని చేసిన ప్రయత్నం కారణంగా.. ఏపీలో రాబోయే తరాలన్నీ కూడా నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. ‘ప్రజల మనోభావాలు గుర్తించలేని ప్రభుత్వాలు ఉంటేనేమి? లేకపోతేనేమి? ప్రజాస్వామయ్య యుతంగా నిరసన తెలియజేయాలనుకున్నప్పుడు అనుమతి ఇవ్వడానికి.. ఇవ్వకపోవటానికి మీరెవరు? వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. మీరు పాదయాత్రలు ఎలా చేశారు? భారీ సభలు ఎలా నిర్వహించారు? మేం వేస్తేఓట్లతో గెలిచిన మీరు మాకు నీతులు చెబుతారా?’’ అని చెడామడా తిట్టేశారు. చంద్రబాబు నమ్మినా నమ్మకపోయినా.. ప్రత్యేక హోదా కారణంగా ఏపీకి ఐదేళ్ల వ్యవధిలో లక్ష కోట్ల రూపాయిల ఆదాయం రావటం ఖాయమని.. అంత మొత్తం వస్తే.. ఆ డబ్బుతో మరో సింగపూర్.. శ్రీలంక ఇలా ఏదైనా కట్టొచ్చొని ఫైర్ అయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/