ఆప‌రేష‌న్ గ‌రుడ ఆగిపోలేదంట‌!

Update: 2018-04-21 05:04 GMT
ఆ మ‌ధ్య‌న సినీ న‌టుడు శివాజీ ఆపరేష‌న్ గ‌రుడ అంటూ కాసింత హ‌డావుడి చేసిన సంగ‌తి తెలిసిందే. బీజేపీని టార్గెట్ చేసేలా.. ఏపీ అధికార‌ప‌క్షానికి ద‌న్నుగా నిలిచేలా ఆయ‌న మాట‌లు ఉండ‌టం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆప‌రేష‌న్ గ‌రుడ‌ను ఒక ప్రెస్ మీట్ కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌టం.. దానిపై స‌మ‌గ్ర స‌మాచారాన్ని..  ఆధారాల్ని చూపించే విష‌యంలో శివాజీ మాట‌లు క‌న్వీన్స్ గా లేని ప‌రిస్థితి.

టీవీ ఛాన‌ళ్లు కాస్తంత‌ హ‌డావ‌డి చేసినా ప్రింట్ మీడియాలో మాత్రం పెద్ద‌గా క‌వ‌ర్ చేయ‌ని ప‌రిస్థితి. తాజాగా త‌న పుట్టిన రోజున హోదా సాధ‌న కోసం ఏపీ ముఖ్య‌మంత్రి చేసిన ధ‌ర్మ పోరాట దీక్ష‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ప్ర‌తి ఊరిలో రైలు ట్రాక్ పై కూర్చొని ఆందోళ‌న చేయాల‌ని పిలుపునిచ్చారు. అలా చేస్తే రైల్వే శాఖ కేసులు పెడుతుంద‌నుకుంటే.. ప్ర‌తి ఊరిలో ఎర్ర జెండా పాతితే రైళ్లు ఆగిపోతాయ‌న్నారు.

ఆప‌రేష‌న్ గ‌రుడ ఇంకా ఆగ‌లేద‌న్న ఆయ‌న‌.. ఏపీలో అల‌జ‌డి షురూ చేయాల‌ని భావిస్తున్నార‌న్నారు. రాజ‌ధాని కోసం రైతులు 33వేల ఎక‌రాలు త్యాగం చేశార‌ని.. రైతుల త్యాగం వృధా పోద‌న్నారు. మ‌ద్రాస్ లాంటి గొప్ప రాజ‌ధాని ఉండ‌టంతోనే ఎన్టీఆర్ గొప్ప న‌టుడు..రాజ‌కీయ నాయ‌కుడు అయ్యార‌న్నారు. చిరంజీవి మెగాస్టార్ అయ్యార‌న్నారు. వీళ్లంతా ఏం ఇచ్చార‌ని మ‌ద్రాస్ వెళ్లారు? అని ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదాతో ప‌రిశ్ర‌మ‌లు.. ఉద్యోగాలు వ‌స్తాయ‌ని చెప్పారు.
Tags:    

Similar News