షాకింగ్‌: బండ్ల గ‌ణేష్ కు 6 నెలల‌ జైలు శిక్ష‌!

Update: 2017-11-24 12:04 GMT
నంది వివాదం స‌ద్దుమ‌ణుగుతున్న త‌రుణంలో టాలీవుడ్ లో మ‌రో సంచ‌ల‌నం రేగింది. చెక్ బౌన్స్ కేసులో న‌టుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు 6 నెల‌ల జైలు శిక్ష విధించార‌న్న వార్త టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపింది. టెంప‌ర్ సినిమాకు సంబంధించిన చెల్ల‌ని చెక్ కేసులో గ‌ణేష్ కు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు ....6 నెలల జైలు శిక్షను విధించింది. అంతేకాదు, దాంతోపాటు 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా విధించింది. రూ. 25 లక్షలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఈ శిక్ష ప‌డింది. టెంప‌ర్ చిత్ర క‌థా ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ....గ‌ణేష్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమాకు బండ్ల గ‌ణేష్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. సాధార‌ణంగా త‌న సినిమాల‌కు తానే క‌థ రాసుకునే పూరీ....టెంప‌ర్ కు వక్కంతం వంశీ క‌థ‌ను తీసుకున్నాడు. కథా ర‌చ‌యితగా వంశీకి బండ్ల గ‌ణేష్ ...రూ.25 ల‌క్ష‌ల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ కావ‌డంతో గ‌ణేష్ ను వంశీ చాలా సార్లు సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. అడ్వ‌కేట్ నోటీసులు పంపించినా గ‌ణేష్ స్పందించ‌క‌పోవ‌డంతో వంశీ కోర్టును ఆశ్ర‌యించాడు. వ‌క్కంతం వంశీ ఆ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును విచార‌ణ జ‌రిపిన  న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెలువరించింది. తీర్పు వెలువ‌డిన త‌ర్వాత బండ్ల గ‌ణేష్ అప్పీల్ చేసుకోవ‌డంతో న్యాయ‌స్థానం ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది.

త‌న‌పై వంశీ త‌ప్పుడు కేసు పెట్టార‌ని, ఈ విష‌యంపై మా అసోసియేష‌న్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాన‌ని గ‌ణేష్ చెప్పారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అవ‌స‌ర‌మైతే పైకోర్టులో అప్పీలు చేస్తాన‌ని గ‌ణేష్ చెప్పారు. గ‌తంలో న‌టుడు స‌చిన్ జోషి కూడా గ‌ణేష్ పై కోర్టులో కేసు వేశారు. ప్ర‌స్తుతం ఆ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సినీ రంగంలో చెక్ బౌన్స్ వివాదాలు త‌ర‌చుగా వ‌స్తూనే ఉంటాయి. అయితే, వాటిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప‌రిధిలో ప‌రిష్కారం ల‌భించేది. కానీ, కోర్టులు , శిక్ష‌లు వ‌ర‌కు వెళ్ల‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. వంశీ కేసు కోర్టు వ‌ర‌కు రావ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌
Tags:    

Similar News