కొత్త తరం సోషల్ మీడియా పుణ్యమా అని సరికొత్త ప్రేమాయాణాలు మొదలయ్యాయి. ముఖా ముఖి పరిచయం లేకున్నా.. ఆన్ లైన్ లో చూపులు కలిసి.. ప్రేమలో పడటాలు.. ఆ తర్వాత గుడ్డి నమ్మకంతో జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వదిలేసి ప్రేమ కోసం పరుగులు పెట్టే ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా చెప్పేది అదే కోవకు చెందిన ప్రేమ కు సంబంధించింది.
ఇటీవల కాలం లో యూత్ ను బాగా ఆకర్షిస్తున్న టిక్ టాక్ కారణంగా వరుసకు అక్కా చెల్లెళ్లు అయ్యే ఇద్దరు యువతులకు మరో ఇద్దరు పరిచయమయ్యారు. అంత లోనే ప్రేమలో పడ్డారు. తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి చెందిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఏపీ లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలానికి చెందిన ఇద్దరు అబ్బాయిల తో ప్రేమలో పడ్డారు. మీరు వస్తే పెళ్లి చేసుకుందామన్నారు. వారిద్దరూ డిగ్రీ చదువుతున్నారు.
దీంతో.. ఆ అమ్మాయిలు మరో ఆలోచన లేకుండా అబ్బాయిల్ని కలిసేందుకు బయలుదేరారు. ఇంట్లో వారు వారిస్తున్నా వినకుండా బాయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన రూట్ మ్యాప్ తో అనంతపురం జిల్లాకు వెళ్లారు. తీరా వెళ్లాక.. ఈ ఇద్దరు యువతుల్ని తాము పెళ్లి చేసుకోలేమని చెప్పారు. దీంతో.. ఏం చేయాలో తోచని యువతులు స్థానికంగా ఉన్న గ్రామ పెద్దల్ని సంప్రదించారు. అక్కడా విషయం తేలకపోవటంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.
ఇంత జరిగిన తర్వాత కూడా ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయిల్నే పెళ్లాడతామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు.. అబ్బాయి లేమో కుదరదంటున్నారు. కన్నవారిని వదిలేసి.. ఆర్నెల్ల క్రితం పరిచయమైనోళ్లు నో అంటున్నా.. వారే కావాలంటూ వేలాడుతున్న ఈ యువతుల వ్యవహారం ఏ వైపునకు తిరుగుతుందన్నది ఇప్పుడు ఉత్కంట రేకెత్తిస్తోంది.