ముంబై లోని ధారావిలో కరోనా కలకలం !

Update: 2020-04-14 08:55 GMT
మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై ధారావిలో కలకలం రేగుతోంది. ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద మురికివాడ ఇది. దీని విస్తీర్ణం 2.7 చదరపు కిలోమీటర్లు. ప్రతి చదరపు కిలోమీటర్‌కు 2.77 లక్షల మంది ఇక్కడ నివసిస్తారు. మొత్తంగా ఈ అతిపెద్ద మురికివాడ ముంబయిలోని ధారావిలో దాదాపు 15 లక్షల మంది నివాసం ఉంటారు.

అలాగే కొత్తగా మరో  ఆరుగురికి కరోనా నిర్దారణ అయ్యింది. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు ధారావిలో మొత్తం 55 మందికి కరోనా సోకగా - ఏడుగురు మృతిచెందారు. దీనితో ధారావిలో ప్రజలకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ధారవి చుట్టూ బారికేడ్‌ లు ఏర్పాటు చేసిన అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

అక్కడ ఐసోలేషన్ - క్వారంటైన్‌ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో అత్యంత సమీపంలో ఇళ్లు ఉండటంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటే దాన్ని నిరోధించడం కష్టమైన పని అని అధికారులు ఆందోళన చెందుతున్న వేళ  అక్కడ మరో 6  కరోనా కేసులు  నిర్ధారణ కావడం అలజడి రేపుతోంది. అలాగే ధారావీలో ప్రతి 1,440 మందికి ఒక పబ్లిక్‌ టాయ్‌ లెట్‌ ఉంది. అపరిశుభ్ర పబ్లిక్‌ టాయిలెట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వేగంగా వ్యాపించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.



Tags:    

Similar News